Yaman Review
నకిలీ, డా.సలీం చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని సినిమాలకు తెలుగులో ఆటోమెటిక్‌గా క్రేజ్ క్రియేట్ అయ్యింది. బిచ్చగాడు తర్వాత భేతాళుడు, ఇప్పుడు యమన్ మంచి బిజినెస్ క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిచ్చగాడు ఎఫెక్ట్‌తో యమన్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి యమన్‌తో విజయ్ ఆంటోని ఎలాంటి సక్సెస్‌ను అందుకున్నాడు? పొలిటికల్ థ్రిల్లర్‌గా వచ్చిన యమన్ ఏ మేర ప్రేక్షులను ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
కథ:
ఓ గ్రామంలో దేవర కొండ గాంధీ(విజయ్ ఆంటోని) రాజకీయాల్లో ప్రజల పక్షాన పోరాడుతూ చురుకైన అభర్థిగా కౌనిల్సర్ స్థాయికి ఎదుగుతాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. వారికి పుట్టిన బిడ్డకు అశోక చక్రవర్తి అనే పేరు పెడతారు. గాంధీ ఎదుగుదలను హర్షించని పాండు రంగారావు. గాంధీకి, అతని బావమరిదికి గొడవలు పెడతాడు. గొడవల్లో ఇద్దరినీ చంపేస్తాడు. భర్త మరణంతో గాంధీ భార్య కూడా చనిపోతుంది. వారి బిడ్డ అయిన అశోక్ తాతయ్య దగ్గర పెరుగుతాడు. తన తాతకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్యం కోసం సాంబ అనే రౌడీ షీటర్‌ను చంపడానికి జరిగిన యాక్సిడెంట్‌ను తనపై వేసుకుని జైలుకెళ్తాడు. సాంబను నరసింహ చంపాలనుకుంటాడు. నరసింహపై కోపంతోసాంబ అశోక చక్రవర్తిని చంపాలనుకుంటాడు. కానీ ఈలోపు అశోక్ జైలు నుండి బయటకు వచ్చేస్తాడు. అక్కడ నుండి విజయ్ ఆంటోని రాజకీయంగా ఎదుగుతూ వస్తాడు. మధ్యలో అశోక్‌కు, అంజన(మియాజార్జ్) ప్రేమ వ్యవహారం నడుస్తుంటుంది. మరి అశోక్ తన రాజకీయ ప్రత్యర్థులను ఎలా ఎదుర్నొన్నాడు? అసలు తన తండ్రిని చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
సినిమా ఆద్యంతం బావుంది. ప్రతి సీనూ, మరో సీనుతో కనెక్ట్ అయ్యి ఉంది. టైట్ స్క్రీన్‌ప్లే, ఎక్కడా అనవసరపు సన్నివేశాలు కనపడవు. తండ్రి గెటప్‌లోని విజయ్ ఆంటోనిని చూస్తే భేతాళుడులో విజయ్ ఆంటోని గెటప్ గుర్తుకు వస్తుంది. రాజకీయాలకు సంబంధించి చిక్కగా రాసుకున్న కథ. విజయ్ ఆంటోని మంచి నటనతో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు.
మైనస్ పాయింట్స్:
సీరియస్‌గా సాగే కథలో మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్, వాటిలో విజయ్ ఆంటోని వేసిన స్టెప్పులు ఆకట్టుకోవు. నాయకులు, వారి అనుచరులు, వారి పగలు, ప్రతీకారాలు ఆడియెన్స్‌ను కన్‌ఫ్యూజన్‌కు గురిచేస్తాయి. తదేకంగా చూస్తే తప్ప సినిమా పెద్దగా ఎక్కదు. చిత్రంలో కామెడి అసలు కనపడదు. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు కనపడవు. తను ఎంచుకున్న మార్గం కోసం హృరో అధర్మానికి పాల్పడటం కాస్త మింగుడు పడని విషయం.
సమీక్ష:
విజయ్ ఆంటోని ఎప్పటిలాగానే తన పాత్రలో ఒదిగిపోయి తనదైన చక్కటి నటనను ప్రదర్శించాడు. తండ్రిగా, కొడుకుగా విజయ్ నటన మెచ్చుకోలుగా ఉంది. అలాగే సీనియర్ నటుడు త్యాగరాజన్ నటన కూడా ప్రేక్షకులను ఆట్టుకుంటుంది. సినిమాలో అక్కడక్కడా తమిళ నెటివిటీ కొట్టొచ్చినట్టు కనపడింది. ఒక వ్యక్తి మైండ్ గేమ్ ఎలా ఆడాడు..తన చుట్టూ ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా ఎలా మలచుకున్నాడనే విషయాన్ని చక్కగా చూపెట్టారు దర్శకుడు జీవ శంకర్..దర్శకత్వంతో పాటు చక్కటి కెమెరా పనితనాన్ని చూపెట్టారు. అలాగే విజయ్ ఆంటోని అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. సినిమా గ్రిప్పింగ్‌గా సాగినా చాలా ఆసక్తిగా చూస్తే తప్ప..ఆడియెన్‌కు కనెక్ట్ కాదు ఈ యమన్ .
బోటమ్ లైన్: 'యమన్'.. పరావాలేదనిపించే పొలిటికల్ థ్రిల్లర్
Yaman English Version Movie Review
- Read in English