ముంచుకొస్తున్న ‘యాస్’ తుపాను.. భారత నావికాదళం అప్రమత్తం
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు తుపానులు భారత్‌ను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమతీరాన్ని వణికించిన ‘తౌక్టే’ తుపాను కాస్త బలహీన పడిందని ఆనందిస్తున్న తరుణంలో విశాఖ వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. తూర్పు తీరాన్ని వణికించేందుకు మరో తుపాను ముంచుకొస్తోంది. ఈ తుపానుకు 'యాస్' గా నామకరణం చేశారు. నేడు(శనివారం) తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.అది క్రమంగా బలపడి తీవ్ర తుపానుగా మారనుందని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 26న బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఎయిర్ ఇండియాపై సైబర్ దాడి..
కాగా.. బే ఆఫ్ బెంగాల్ మీదుగా రానున్న యాస్ తుపాను నేపథ్యంలో భారత నావికదళం అప్రమత్తమైంది. ఉత్తర అండమాన్ సముద్రాలతో అల్పపీడన ప్రాంతం తుఫానుగా మారే ఆవకాశం ఉంది. ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ మధ్య ఈనెల 26 నాటికి తీరం దాటే ఆవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారత నావికాదళం ఒడిషా, పశ్చిమ బెంగాల్‌కు చేరుకుంది. భారత నావికాదళంలో 8 వరద సహాయ బృందాలు, 4 డైవింగ్ బృందాలున్నాయి. అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో సహాయం అందించడానికి 4 నావిక దళాలు, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ( HADR), డైవింగ్, వైద్య బృందాలతో సిద్ధంగా ఉన్నాయి. నావల్ ఎయిర్ స్టేషన్‌లలో, విశాఖలో ఐఎన్ఎస్ డేగాతో పాటు చెన్నైలో ఐఎన్ఎస్ రాజాలిలో నావికదళ విమానాలను భారత నావికాదళం సిద్ధం చేసింది.
ప్రస్తుత అంచనాల ప్రకారం రాబోయే తుపాను సముద్రంలోనే బలపడుతుంది. ఆపై దిశ మార్చుకుని బంగాళఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ ఇటీవల తెలిపారు. ఈ తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అల్పపీడనం ఏర్పడిన 72 గంటల్లో అది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముంది. రుతుపవనాల ఆగమనానికి ముందు.. ఈ నెల 22న ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఇటు ఆంధప్రదేశ్ తీర ప్రాంతంలో కూడా వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments