యాస్ తుపాను ఎఫెక్ట్... 25 రైళ్ల రద్దు
Send us your feedback to audioarticles@vaarta.com
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాను కారణంగా ముందు జాగ్రత్తగా రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే మే 24 నుంచి మే 29వ తేదీ వరకు మొత్తం 25 రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్రన్ రైల్వే ప్రకటించింది. యాస్ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా 25 రైళ్లను నిలిపివేశారు.
పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల సముద్ర తీర ప్రాంతాల్లో యాస్ తుపాను కారణంగా గంటకు 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ క్రమంలోనే గౌహతి-బెంగళూరు కంటోన్మెంట్, ముజఫర్ పూర్- యశ్వంత్ పూర్, ఎర్నాకుళం-పాట్నా రైళ్లను రద్దు చేశారు. అలాగే సిల్చార్, న్యూజల్పాయ్ గుడి, జయనగర్, పూరి, గౌహతి, పాట్నా, అగర్తలా మార్గాల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఈస్ట్రన్ రైల్వే వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout