యాస్ తుపాను ఎఫెక్ట్... 25 రైళ్ల రద్దు

  • IndiaGlitz, [Monday,May 24 2021]

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాను కారణంగా ముందు జాగ్రత్తగా రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే మే 24 నుంచి మే 29వ తేదీ వరకు మొత్తం 25 రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్రన్ రైల్వే ప్రకటించింది. యాస్ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా 25 రైళ్లను నిలిపివేశారు.

పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల సముద్ర తీర ప్రాంతాల్లో యాస్ తుపాను కారణంగా గంటకు 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ క్రమంలోనే గౌహతి-బెంగళూరు కంటోన్మెంట్, ముజఫర్ పూర్- యశ్వంత్ పూర్, ఎర్నాకుళం-పాట్నా రైళ్లను రద్దు చేశారు. అలాగే సిల్చార్, న్యూజల్పాయ్ గుడి, జయనగర్, పూరి, గౌహతి, పాట్నా, అగర్తలా మార్గాల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఈస్ట్రన్ రైల్వే వెల్లడించింది.

More News

హాట్ పిక్ : ప్రియాంక అందుకే వరల్డ్ ఫేమస్

ప్రియాంక చోప్రా.. ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరుగుతున్న మరణాలు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. భారీగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

రాంగోపాల్ వర్మ సోదరుడు మృతి.. బోనీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు వరుసకు సోదరుడైన సోమశేఖర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కరోనాతో భాదపడుతున్న

కొవాగ్జిన్ తీసుకున్నారా? అయితే ఆ దేశాల్లోకి నో ఎంట్రీ..

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికే తమ దేశాల్లోకి ఎంట్రీ అనే నిబంధనను పలు దేశాల్లో అమల్లోకి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే గల్ఫ్‌ దేశాలు నిబంధనలకు సిద్ధమవుతున్నాయి.

ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదు: అనిల్ కుమార్ సింఘాల్

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీకి క్రమక్రమంగా లైన్ క్లియర్ అవుతోంది. పంపిణీకి అభ్యంతరం లేదని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.