కంగనకు వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించిన కేంద్రం!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్లో ఏదనిపిస్తే అది వెనుకాడకుండా మాట్లాడుతూ.. స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించినట్లు సమాచారం. ఆది నుంచి అమ్మడు వివాదాలకు పెట్టింది పేరు. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజం అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి.. తన కామెంట్లు, ట్వీట్స్‌తో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్లో నెపోటిజం గురించి కంగన చేసిన వ్యాఖ్యలపై అమ్మడికి మద్దతు ఎంతైతే వచ్చిందో.. సెలబ్రెటీల నుంచి అభ్యంతరాలూ ఆ మేరకే వచ్చాయి. ముఖ్యంగా దీపికా పదుకొణెపై కంగన చేసిన ట్వీట్స్ అత్యంత వివాదాస్పదంగా మారాయి. బాలీవుడ్లో అందరిది ఒక దారైతే.. కంగనది మరో దారి. ఎప్పుడూ ఆమె ఆలోచనా విధానం సహ నటులకు భిన్నంగానే ఉంటుంది. ఇదంతా చాలదన్నట్టు ఈ ముద్దుగుమ్మ ఇటీవల ముంబై నగరంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందని వ్యాఖ్యానించి కంగన పెద్ద దుమారమే రేపింది. అంతే కాదు.. ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని తెలిపింది. ఈ వ్యాఖ్యలపై అధికార శివసేన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర, ముంబై, మరాఠాల గురించి మితిమీరి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించింది. కంగన చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ముంబై పోలీసులపై నమ్మకం లేదంటూ కంగన చేసిన వ్యాఖ్యలకు కూడా సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడ అడుగుపెట్టవద్దని కంగనకు సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout