యాపిల్‌పై షియోమీ సెటైరికల్ వీడియో.. మిలియన్లలో వ్యూస్..
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం యాపిల్‌పై చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ సెటైరికల్‌గా వీడియో విడుదల చేసింది. ఈ వీడియోను మిలియన్ల కొద్దీ జనాభా వీక్షించారు. లైక్స్ కూడా ఓ రేంజ్‌లో వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. యాపిల్ సంస్థ ఇటీవల ఐఫోన్ 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ మోడల్ ఫోన్లకు ఇయర్స్ ఫోన్స్ ఇవ్వకుంటే ఓకే కానీ కనీసం చార్జర్ కూడా ఇవ్వలేదు. దీంతో యాపిల్ అభిమానులు చార్జర్ లేని ఫోన్ కొని తామేం చెయ్యాలంటూ అసంతృప్తి వ్యక్తం చేవారు.
యాపిల్ ఫోన్ కాస్ట్ మామూలుగా ఉండదు. సామాన్యులు ఈ ఫోన్‌ను కొనలేరు. అంత కాస్ట్ పెట్టి కొనుక్కున్న ఫోన్‌కు చార్జర్ ఇవ్వకపోవడం పట్ల వినియోగదారులు ఫైర్ అవుతున్నారు. ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లతో చార్జర్, ఇయర్ ఫోన్స్ ఇవ్వడం లేదన్న వార్త బయటకు వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆండ్రాయిడ్ కంపెనీలు యాపిల్ సంస్థపై దారుణంగా ట్రోల్స్ మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ ఒక సెటైరికల్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
షియోమీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ‘ఎంఐ 10టీ ప్రొ’ని కొనుగోలు చేసిన వ్యక్తి ఆ బాక్స్‌ని ఓపెన్ చేస్తారు. అందులో చార్జర్ కూడా కనిపిస్తుంది. ’చింతించకండి. ఎంఐ 10టి ప్రొతో మేం దేనినీ విడిచిపెట్టడం లేదు’ అని ఈ వీడియోకు షియోమీ క్యాప్షన్ ఇచ్చింది. పోయిన వారం ఈ వీడియోను షియోమీ షేర్ చేయగా.. మిలియన్ల మంది ఇప్పటికే ఈ వీడియోను వీక్షించగా.. దాదాపు 40 వేల మంది లైక్ చేశారు. కాగా.. యాపిల్‌పై శాంసంగ్ కూడా సెటైర్లు వేసింది. తాము మాత్రం చార్జర్ ఇస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com