షియోమీ నుంచి సరికొత్త బైక్.. ధర 31వేలు మాత్రమే!
Send us your feedback to audioarticles@vaarta.com
చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ఫోన్లు మార్కెట్లోకి తెస్తూ.. ఇతర బ్రాండ్స్‌కు గట్టిగా పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొబైల్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న షియోమీ గతనెలలో.. సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లో తెచ్చింది. ఈ బైక్‌కు హిమో టీ1గా పేరు పెట్టారు. 90ఎంఎం వెడల్పుగా ఉన్న టైర్లు, వన్ బటన్ స్టార్ట్, మల్టీ కాంబినేషన్ స్విచ్, డిజిటల్ డిస్‌ప్లే వంటివి ఈ బైక్ ప్రత్యేకతలు.
కాగా.. ఈ బైక్ ధర 2,999 యువన్‌లు అంటే ఇండియా దాదాపు రూ.31,000. కాగా మార్కెట్‌లోకి గత నెలలోనే చైనా మార్కెట్‌లో తెచ్చినప్పటికీ.. అమ్మకాలు మాత్రం జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే అకాశముంది. ఇదిలా ఉంటే.. ఈ బైక్ బరువు 53 కేజీలు కావడం విశేషం. కాగా ఈ బైక్‌లు ఎరుపు, గ్రే, తెలుపు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
హిమో టీ1లో లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంటుంది.. దీని కెపాసిటీ 14,000 ఎంఏహెచ్. వోల్టేజ్ 48వీ. 14ఏహెచ్, 28ఏహెచ్ ఎనర్జీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 14ఏహెచ్ ఆప్షన్‌తో ఈ ఎలక్ట్రిక్ బైసైకిల్ 60 కిలోమీటర్లు వెళ్తుంది. అదే 28 ఏహెచ్ ఆప్షన్‌తో అయితే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కాగా.. ఈ బైక్ గురించి ఇప్పటికే పలు వెబ్‌సైట్లు, క్రిటిక్స్ మంచిగానే రేటింగ్స్, రివ్యూస్ ఇచ్చారు. దీంతో షియోమీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సేల్స్ జరుగుతాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇండియాలోని షియోమీ ఫ్యాన్స్.. హిమో టీ1 ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందా అని వేచి చూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout