షియోమీ ఎంఐ- 9 హిట్టా.. ఫట్టా.. రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
స్మార్ట్‌ఫోన్ విపణిలో దక్షిణ కొరియా మేజర్ శామ్సంగ్ సహా ఇతర దిగ్గజ సంస్థలకు దీటుగా విక్రయాలను చేస్తున్న చైనా సంస్థ షియోమీ తాజాగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే చైనాలో అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిదారుగా షియోమీ నిలిచింది. రోజురోజుకూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న స్మార్ట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఫోన్లను తయారుచేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు షియోమీ ఇప్పటికే పలు ఫోన్లను మార్కెట్లలోకి రిలీజ్ చేసి తమ బ్రాండ్ ఏంటో తెలియజేసిన సంగతి తెలిసిందే.
ఎంఐ 9 అదుర్స్..
అయితే తాజాగా.. స్మార్ట్‌ఫోన్ ఎంఐ 9ను విడుదల చేసింది. ఇందులో 6.39 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను కంపెనీ అందిస్తోంది. ముఖ్యంగా స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను అమర్చినందున ఫోన్ ఎంత స్పీడ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా మూడు 48, 12, 16 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్‌లో 20 మెగాపిక్సల్ కెమెరాను అమర్చడం జరిగింది. ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అలాగే వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు.
భారీ ర్యామ్..
ఈ ఫోన్‌కు గాను 12 జీబీ ర్యామ్ వేరియెంట్‌ను కూడా విడుదల చేశారు. కాగా ప్రపంచంలోనే ఇంత భారీ ర్యామ్ ఉన్న ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్‌కు చెందిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.31,725 ధరకు లభ్యం కానుండగా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.34,900 ధరకు, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.42,300 ధరకు ఈ నెల 26వ తేదీ నుంచి లభ్యం కానున్నాయని చెప్పినప్పటికీ ఇంత వరకూ మార్కెట్లోకి రాలేదు. బహుశా రాకపోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఫైనల్‌గా ఎంఐ9 ఫీచర్లు...
6.39 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1080 × 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 16, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్.
ఎంఐ9 రివ్యూ..
డిస్ప్లే పరంగా మిగతా ఫోన్లతో పోలిస్తే టూ డిఫరెంట్‌గానే ఉంది.
మూడు కెమెరాలుండే ఫోన్లో అది కూడా బ్యాక్ సైడ్ ఉండటం బహుశా ఇదే ఫస్ట్ ఫోన్. ఈ ప్రయోగం కచ్చితంగా వర్కవుట్ అవుతుంది.
ఫోన్ అంతా ఓకే గానీ బ్యాటరీ సామర్థ్యం చాలా టూమచ్‌గా ఉంది. ఇప్పుడు వచ్చే ఫోన్లు అన్నీ దాదాపు 4000 ఎంఏహెచ్పైనే ఉన్నాయి కానీ ఎంఐ9 మాత్రం 3,300 ఎంఏహెచ్ ఉండటం చాలా తక్కువ అనిపిస్తోంది. ఇంత ప్రాసెసర్ ఉన్న ఫోన్‌తో బ్యాటరీ ఎక్కవసేపు నిలబడకపోవచ్చు.
ఫింగర్ ప్రింట్ అనేది అన్ని ఫోన్లతో పాటే ఈ ఫోన్‌కు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో కొత్తదనమేమీ లేదు.
బ్యాక్‌సైడ్ ఫోన్ డోర్ కోటింగ్ కొత్తగా అనిపిస్తోంది.
మిగతా ఫోన్లతో పోలిస్తే చార్జింగ్ చాలా తొందరగా.. ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్పాస్ట్గా అవుతోంది. అంతేకాదు చార్జర్ కూడా డిఫరెంట్‌గా ఉంది.
ఫోన్‌కు ఫ్రంట్ మాత్రమే కాదు.. బ్యాక్ సైడ్ కూడా గొరిల్లా గ్లాస్ ఇవ్వడంతో స్మార్ట్ ప్రియులు అందరూ ఆకర్షితులవుతారు.
స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉండటంతో ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది.
స్పీడ్ పరంగా చూస్తే ఒకట్రెండు ఐఫోన్లతో పోలిస్తే ఈ ఫోన్ పాస్ట్గానే ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments