చిరు 150వ సినిమా కోసం వర్క్ చేస్తున్న రైటర్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం గత కొంతకాలంగా అటు అభిమానులు....ఇటు ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పుడు చిరుని 150వ సినిమా గురించి అడిగితే...టైం కుదిరితే ఖచ్చితంగా చేస్తా అని చెప్పావారు. ఇప్పుడు టైం కుదిరింది. సినిమా చేద్దాం అంటే మెగాస్టార్ క్రేజు, ఇమేజు కి తగ్గ కథ కుదరడం లేదు. చాలా మంది రైటర్స్ చిరు 150వ సినిమా కథ కోసం కుస్తీపడుతున్నారు.
సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పిన కథ నచ్చింది. చిరు 150వ సినిమాకి పూరి డైరెక్టర్ అని స్వయంగా చిరు తనయుడు చరణ్ ప్రకటించడం జరిగింది. ఆతర్వాత పూరి చిరుకి ఫస్టాఫ్ చెప్పారు. చిరుకి బాగా నచ్చింది. ఇంకేముంది త్వరలోనే సెకండాఫ్ కూడా చెప్పేస్తాడనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఊహించని పరిణామాలు ఎదురవ్వడంతో పూరి వరుణ్ తేజ్ తో లోఫర్ స్టార్ట్ చేసాడు. చిరు మళ్లీ150వ సినిమా కథ కోసం అన్వేషణ ప్రారంభించారు.
చిరు 150వ సినిమా కథ కోసం చాలా మంది రైటర్స్ వర్క్ చేసారు. చేస్తున్నారు కూడా. ఇప్పటి వరకు మీకు ఎవరెవరు కథ చెప్పారు అని చిరుని అడిగితే...రచయిత బి.వి.ఎస్.రవి ఓ కథ చెప్పాడు. బాగానే ఉందనిపించింది కానీ ఎక్కడో అసంత్రుప్తి. అలాగే పరుచూరి బ్రదర్స్ , చిన్నిక్రిష్ణ, ఆకుల శివ, కోన వెంకట్...వీళ్లందరు చిరుకి కథ చెప్పారట. కానీ ఎందుకనో చిరుకు పూర్తి స్థాయిలో సంత్రుప్తి కలగలేదట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు.
ఇండియన్ ఫిలిం హిస్టరీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాహుబలి, భజరంగి భాయిజన్ చిత్రాలకు కథ అందించి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారిన సెన్సేషనల్ రైటర్ విజయేంద్రప్రసాద్. ప్రస్తుతం బాహుబలి 2 స్ర్కిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆయనను తన ఇమేజుకు తగ్గ కథ రెడీ చేయమని చిరు అడిగారట. అయితే విజయేంద్రప్రసాద్ మాత్రం తనకు కాస్త సమయం కావాలన్నారట.
అయితే.... చిరు సినిమా కోసం తమిళంలో విజయం సాధించిన ఓ సినిమా రీమేక్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరు చరణ్ బ్రూస్ లీ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. కనుక బ్రూస్ లీ చిత్రమే చిరు 150వ సినిమా అవుతుంది. కానీ చిరు మాత్రం తను హీరోగా నటించే చిత్రం కోసం కథ రెడీ అవుతుంది అంటున్నారు. మరి...చిరు రీమేక్ పై ఆధారపడతారా..? లేక విజయేంద్రప్రసాద్ కథ కోసం వెయిట్ చేస్తారా..? లేక ఇప్పటి వరకు కథ చెప్పిన రైటర్స్ లో ఎవరో ఒకరి కథ ఫైనల్ చేస్తారా..? ఏది ఏమైనా చిరు సినిమా ఏమిటనేది అక్టోబర్ నెలాఖరు లోపు ఎనౌన్స్ చేస్తానన్నారు. అది ఏమిటనేది తెలియాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com