ప్రముఖ రచయిత్రి యుద్ధ‌నపూడి సులోచనరాణి కన్నుమూత

  • IndiaGlitz, [Monday,May 21 2018]

ప్రఖ్యాత రచయిత్రి యుద్దనపూడి సులోచనారాణి అమెరికాలోని కాలిఫోర్నియాలోని గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు ధృవీకరించారని సమాచారం. గుండెపోటుతో ఆమె నిద్ర‌లోనే క‌న్నుమూశారని ఆమె కుమార్తెలు ధృవీక‌రించారు. కాలిఫోర్నియాలోనే సులోచ‌నారాణి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారట‌.

న‌వ‌లా ర‌చ‌యిత్రిగా య‌ద్ధ‌న‌పూడికి చాలా విశిష్టమైన పేరుంది. 1970 దశకంలో యుద్దనపూడి సులోచనరాణి రాసిన నవలలు అనేకం ఎంతో ప్రసిద్ది చెందాయి. తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలలు ఆమె రాశారు. ఆమె రాసిన నవలల ఆధారంగా అనేక సినిమాలు తీశారు. మధ్యతరగతి జీవితాల గురించి ఆమె అనేక విషయాలను తన నవలల్లో ప్రస్తావించేవారు. 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో యుద్దనపూడి సులోచనరాణి జన్మించారు. తను పరిశీంచిన జీవితాలను కథా వస్తువులుగా తీసుకొని ఆమె రచనలు చేశారు. . తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి పాత్రలను సృష్టించారు.

భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు.

యుద్దనపూడి సులోచనారాణి తొలిసారిగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది. ఆ రోజుల్లో ప్రతి యువకుడు ఓ రాజశేఖరంలా ప్రతి యువతీ ఆత్మాభిమానం గల జయంతిలా ఉండాలనుకునే వారు. మీనా నవల పత్రికలో ధారావాహికగా వచ్చింది. పేరును పాఠకులే నిర్ణయించారు. చివరకు మీనా నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి సినిమాగా తీసింది

More News

యు.ఎస్.బాక్సాఫీస్: $10 మిలియన్ మార్కును అందుకున్న టాలీవుడ్

ఈ ఏడాది సమ్మర్ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి ఎప్పటికీ గుర్తుండి పోతుంది.

ఎన్టీఆర్ బయోపిక్‌లో శర్వానంద్

మహానటుడు నంద‌మూరి తార‌క రామారావు బయోపిక్‌గా తెర‌కెక్కుతున్న‌ 'య‌న్‌.టి.ఆర్'

'పడి పడి లేచె మనసు' కి ఫుల్ డిమాండ్‌?

శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’.

వినాయ‌క చవితికి నాగ్‌, నాని మూవీ?

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కథానాయకులుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో

ద్విభాషా చిత్రంగా ఎన్టీఆర్ 30?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో