విలన్‌ గా మారిన‌ రచయిత

  • IndiaGlitz, [Wednesday,May 02 2018]

అబ్బూరి రవి.. తెలుగు సినీ ప్రియులకు పరిచయం అక్కరలేని పేరు. మాటల రచయితగా 'ఎలా చెప్పను'తో టాలీవుడ్‌కు పరిచయమైన ర‌వి.. పాతిక సినిమాలకు పైగా మాటలను అందించారు. అందులో 'బొమ్మరిల్లు', 'కిక్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్', 'ఎవడు', 'క్షణం', 'ఊపిరి', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి విజయవంతమైన చిత్రాలు కూడా ఉన్నాయి.ఇప్పుడు ఈ మాటల రచయిత విలన్‌గా అవతారం ఎత్తనున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే.. సాయి కిరణ్ అడివి డైరెక్షన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అందులో విలన్ పాత్ర కోసం అబ్బూరి రవిని సంప్రదించారట దర్శకుడు. ముందు ససేమిరా అన్నా.. సాయి కిరణ్ మాత్రం ఎలాగోలా కన్విన్స్ చేసి ఒప్పించారని సమాచారం.

విలన్ పాత్ర కోసం బాలీవుడ్ వైపు చూస్తున్న ఈ తరుణంలో.. ఒక తెలుగు రచయితను విలన్‌గా నటింపచేయడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే.. మాటల రచయితగా విజయం సాధించిన రవి.. ఇప్పుడు నటుడిగా ఏ మేర ఆకట్టుకుంటారో వేచి చూడాలి.