సాయిధరమ్‌తేజ్ తో వర్క్ చేయడం నా అదృష్టం : 'తిక్క' రచయిత షేక్ దావూద్
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధరమ్ తేజ్ హీరోగా ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం తిక్క. ఈ చిత్రాన్ని నూతన నిర్మాత రోహిణ్ రెడ్డి నిర్మించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన తిక్క సినిమా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా తిక్క స్టోరీ - స్ర్కీన్ ప్లే రైటర్ షేక్ దావూద్ మాట్లాడుతూ....చెన్నై లో పుట్టి పెరిగిన నేను సినిమాల పై ఉన్న ప్రేమతో ఆస్ట్రేలియా లో ఫిలిం డిప్లొమా కోర్సు చేసి, సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీ ని పెట్టుకుని 50 కి పైగా యాడ్ ఫిలిమ్స్ తీశాను. కాకపోతే సినిమాలకు స్టోరీ & స్క్రీన్ ప్లే రాయలని ట్రైల్స్ లో ఉన్న నాకు కృష్ణ వంశీ గారు పిలిచి మొగుడు సినిమాకి స్క్రీన్ ప్లే రాసే అవకాశం ఇచ్చారు. ఆ తరువాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్,ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలకు కూడా స్క్రీన్ ప్లే విభాగంలో పని చేశాను. సాయిధరమ్ తేజ్ నటించిన తిక్క సినిమాకి కథ,స్క్రీన్ ప్లే అందించడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
ఒక కొత్తదనం ఉన్న,డిఫరెంట్ కథని అర్ధం చేసుకుని,ఒప్పుకుని నన్ను ఎంకరేజ్ చేసిన మా హీరో సాయి ధరమ్ తేజ్ గారికి,అలాగే మా ప్రొడ్యూసర్ రోహిణ్ రెడ్డి గారికి,నా కథని చాలా గొప్పగా స్క్రీన్ మీదకు తీసుకువచ్చిన దర్శకుడు సునీల్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.తిక్క సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి,నటించిన నటీనటులు అందరికి థాంక్స్ అండ్ కంగ్రాట్స్.నా గత సినిమాల వలే ఈ సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని,మాకు అఖండ విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను.అలాగే టాలెంట్ కి పట్టం కట్టే తెలుగు ఇండస్ట్రీ నా మీద చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com