నేను చనిపోయినా నా కొడుకు పోరాటం చేస్తాడు శ్రీమంతుడు కథ నాదే - రైటర్ శరత్ చంద్ర..!
- IndiaGlitz, [Wednesday,January 25 2017]
సూపర్ స్టార్ మహేష్ బాబు - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. అయితే...శ్రీమంతుడు సినిమా కథ నాదే అంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. 2012లో రాసిన చచ్చేంత ప్రేమ నవలను అనుమతి లేకుండా సినిమా తీసారని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కోర్టు ఐపీసీ 120బి, సెక్షన్ 63 కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని మహేష్ బాబు, కొరటాల శివ, నిర్మాత నవీన్ లను ఆదేశించింది. రచయితల సంఘం ఉండగా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి..? అసలు ఏం జరిగింది..? అని రచయిత శరత్ చంద్రను అడిగితే....
నేను రాసిన చచ్చేంత ప్రేమ నవలలో దేవరకొండ అని రాస్తే....శ్రీమంతుడు సినిమాలో దేవరకోట అని పెట్టారు. అలాగే నా నవలలో తండ్రితో ఘర్షణ తర్వాత కథానాయకుడు విలేజ్ కి వెళతాడు. దీనిని సినిమాలో హీరోయిన్ తో ఘర్షణ తర్వాత హీరో విలేజ్ కి వెళ్లినట్టు చూపించారు.హీరో, హీరోయిన్ ఒకే కాలేజీలో చదవుకోవడం... ఇలా అంతా నా నవల నుంచి తీసుకుందే. నవల చదవండి ఏమన్నా తేడా ఉంటే చెప్పమన్నాను. రైటర్స్ అసోషియన్ లో ఫిర్యాదు చేసాను. వాళ్లు నన్ను కోర్టుకు వెళ్లమన్నారు.కొరటాల శివకు చెప్పాను...ఫస్ట్ ఆయన బంధువుతో మాట్లాడాను. కొరటాల శివ ఫారిన్ లో ఉన్నారు అని చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత కాల్ చేసి మా వాళ్లు మీ నవల చూసారు మీది వేరు నాది వేరు అన్నారు. ఇది రైటర్స్ అసోసియేషన్ లో పెట్టమన్నారు కానీ ఆయన ముందుకు రాలేదు. అయితే...రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత నా నవలను పరిశీలించి ఇది నాది అని అవగాహనకు వచ్చారు. బేరసారాలు ఆడారు.
నా డిమాండ్ ఏమిటంటే....శ్రీమంతుడు చిత్రాన్ని హిందీలో హృతిక్ రోషన్ తో తీస్తున్నారు కాబట్టి క్రెడిట్స్ ఇవ్వండి అన్నాను. 15 లక్షలు ఇస్తామన్నారు. నేను మహేష్ ఫ్యాన్ ని. వ్యక్తిగత ఆరాధన వేరు. ఇది వేరు. ఈ కథ నా బ్రైయిన్ చైల్డ్. దాసరి గారి దగ్గరకి వెళ్లాను. ఆయన నాకు సపోర్ట్ చేసారు. నేను డబ్బు సెటిల్ మెంట్ కాదు గుర్తింపు కోరుతున్నాను. తెలుగులో నా పేరు వేయడానికి కుదరదు ఒప్పుకున్నాను. హిందీలో పేరు వేయండి డబ్బులు అడగను అన్నాను. ఇండస్ట్రీలో వాళ్లే నన్ను కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చారు. ఎంత మెంటల్ స్ట్రైయిన్ అయ్యానో నాకే తెలుసు. మగధీర, జౌను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కథా రచయితలకి జరిగినట్టు అన్యాయం జరగకూడదు. న్యాయం చేయాలనేదే నా డిమాండ్. సిటి సివిల్ కోర్టుకు వేసాను. 6 నెలల వరకు రెస్పాండ్ కాలేదు. హృతిక్ రోషన్ కు కూడా నోటీసులు పంపించాను. కోర్టు స్పందించి నోటీసులు పంపించడం అనేది కొంత న్యాయం జరిగిందని భావిస్తున్నాను.
రైటర్ కి అసోసియేషన్ అండగా నిలవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న తప్పులు చేస్తే శిక్షిస్తాం. అలాంటిది కథాచౌర్యం చేయడం తప్పు కాదా..! ఫేస్ బుక్ లో చాల మంది నా నవల చదవి 100% ఈ స్ర్కిప్ట్ నాదే అని కామంట్ పెట్టారు. ఏ ఒక్కరు నాది కాదని చెప్పినా కేసును విత్ డ్రా చేసుకుంటాను. నా పోరాటాన్ని ఆపను. రచయితల పక్షాన పోరాటం చేస్తున్నాను. దాసరి గారు సపోర్ట్ చేసారు. పరుచూరి గోపాలకృష్ణ గారు సపోర్ట్ చేసి ఫిర్యాదు స్వీకరించడం వలనే ఇది వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి పై నాకు నమ్మకం ఉంది. ఈ విషయాన్ని తమ్మారెడ్డి గారికి చెప్పాను. ఏమౌంట్ ఏర్పాటు చేస్తాను అన్నారు. రైటర్స్ అంటే బిచ్చగాళ్లా..? నా పోరాటాన్ని ఆపను ఆఖరి శ్వాస వరకు పోరాడతాను. నేను చనిపోయిన నా కొడుకైనా పోరాటం చేస్తాడు అని తెలియచేసారు.