'తలైవి' డైరెక్టర్‌పై రచయిత సంచలన వ్యాఖ్యలు!!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం `తలైవి`. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. విష్ణు ఇందూరి, శైలేష్ నిర్మాతలు. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు రచయిత అజయన్ బాలా రాసిన పుస్తకాన్ని ఆధారంగా చేసుకునే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. అయితే ఈ సినిమా విషయంలో తనకు క్రెడిట్ ఇవ్వడం లేదని సదరు రచయిత సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. తనకు ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని, కానీ తలైవి విషయంలో జరిగిన అవమానాన్ని భరించలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాలో కొన్ని అసత్యాలను చూపించారని, కొందరు రాజకీయ నాయకులను అవమానపరిచేలా సన్నివేశాలను తెరకెక్కిస్తే, వాటిని తొలగించమన్నందుకు తన పేరుని తొలగించారని ఆయన తెలిపారు. డైరెక్టర్ విజయ్‌తో పదేళ్ల అనుబంధం ఉందని, తాను ఏడాదిన్నర పాటు స్క్రిప్ట్ రాస్తే తనకు వెన్నుపోటు పొడిచారని అందుకనే తాను భరించలేకపోయానని ఆయన తెలియజేశారు. ఈ పోస్ట్ చేసిన కాసేపటికే అజయన్ తన పోస్ట్‌ను తొలగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments