'మహాభారతం' పై రైటర్ అసంతృప్తి
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ దర్శకుడు శ్రీకుమరన్ డైరెక్షన్ లో మహాభారతాన్ని తెరకెక్కతుందని..., హిందీ, తెలుగు, తమిళం సహా అన్నీ వుడ్స్ లోని ప్రముఖ నటులు నటించనున్నారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. వాసుదేవనాయర్ రాసిన ‘రెండాం మూలం’ నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. వాసుదేవ నాయరే ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించారు. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో నాగార్జున ధర్మరాజు, మోహన్ లాల్ భీముడు, విక్రమ్ అర్జునుడు, అమితాబ్ భీష్ముడు, ఐశ్వర్యరాయ్ ద్రౌపదిగా నటించనుందనే వార్తలు వచ్చాయి.
మలయాళంలో `రెండాం మూలం` అనే పేరుతో మిగిలిన ఇండియన్ లాంగ్వేజెస్‌లో `మహాభారతం` పేరుతో సినిమా తెరకెక్కతుందని అన్నారు కానీ ఇప్పటి వరకు సినిమా సెట్స్‌కు వెళ్లనేలేదు. దీంతో రచయిత వాసుదేవ నాయర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మూడేళ్లలో నిర్మిస్తామని స్క్రిప్ట్ తీసుకున్నారు కానీ నాలుగేళ్లు అవుతున్నా సినిమా ప్రారంభం కానేలేదు. నా స్క్రిప్ట్‌ని వెనక్కిచ్చేయమని అడుగుతాను. దర్శక నిర్మాతలను కలిసి పరిస్థితిని తెలుసుకుంటానని ఫేస్బుక్ ద్వారా తన మనసులోని మాటలను బయట పెట్టారు వాసుదేవ నాయర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout