'మ‌హాభార‌తం' పై రైట‌ర్ అసంతృప్తి

  • IndiaGlitz, [Friday,October 12 2018]

మలయాళ దర్శకుడు శ్రీకుమరన్ డైరెక్షన్ లో మహాభారతాన్ని తెరకెక్కతుంద‌ని..., హిందీ, తెలుగు, తమిళం సహా అన్నీ వుడ్స్ లోని ప్రముఖ నటులు నటించనున్నారని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. వాసుదేవనాయర్ రాసిన ‘రెండాం మూలం’ న‌వ‌ల‌ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. వాసుదేవ నాయ‌రే ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించారు. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో నాగార్జున ధర్మరాజు, మోహన్ లాల్ భీముడు, విక్రమ్ అర్జునుడు, అమితాబ్ భీష్ముడు, ఐశ్వర్యరాయ్ ద్రౌపదిగా నటించనుందనే వార్తలు వ‌చ్చాయి.

మ‌ల‌యాళంలో 'రెండాం మూలం' అనే పేరుతో మిగిలిన ఇండియ‌న్ లాంగ్వేజెస్‌లో 'మ‌హాభార‌తం' పేరుతో సినిమా తెర‌కెక్క‌తుందని అన్నారు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా సెట్స్‌కు వెళ్ల‌నేలేదు. దీంతో ర‌చ‌యిత వాసుదేవ నాయ‌ర్ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. మూడేళ్ల‌లో నిర్మిస్తామ‌ని స్క్రిప్ట్ తీసుకున్నారు కానీ నాలుగేళ్లు అవుతున్నా సినిమా ప్రారంభం కానేలేదు. నా స్క్రిప్ట్‌ని వెన‌క్కిచ్చేయ‌మ‌ని అడుగుతాను. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను క‌లిసి ప‌రిస్థితిని తెలుసుకుంటాన‌ని ఫేస్‌బుక్ ద్వారా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టారు వాసుదేవ నాయ‌ర్‌.

More News

తండ్రులుగా త‌న‌యులు...

సినీ రంగంలో తండ్రి పాత్ర‌లో త‌నయుడు న‌టించ‌డం అనేది ఓ అనుభూతి. ఇప్పుడు ఇండ‌స్ట్ర‌లో ఇద్ద‌రు హీరోలు వారి తండ్రుల పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

సైరాలో విజ‌య్‌సేతుప‌తి లుక్‌..

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో..

'#మీ టూ' పై అమితాబ్ స్పంద‌న‌

ఓ షూటింగ్ స‌మ‌యంలో సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని త‌నుశ్రీ ద‌త్తా ఆరోపించింది.

'విశ్వామిత్ర' టీజర్‌ లాంచ్ చేసిన నందిత‌

రాజకిరణ్‌ సినిమా నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. నందితారాజ్‌, ‘సత్యం’ రాజేష్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌ కీలక పాత్రధారులు. రాజకిరణ్‌ దర్శకుడు.

సైరాలో అమితాబ్ లుక్‌

చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `సైరా న‌ర‌సింహా రెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్ర‌మిది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తొలి యోధుడు ఓ తెలుగువాడు..