హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్కర్ (23) హత్య కేసులో నిందితుడిగా ఉన్న డబుల్ ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత 15 రోజులుగా సుశీల్ పరారీలో ఉన్నాడు. తాజాగా పంజాబ్‌లోని జలంధర్ సమీపంలో అరెస్టయ్యాడు. సుశీల్‌తోపాటు అతడి ప్రధాన అనుచరుడు అజయ్ కుమార్‌ను సైతం ఢిల్లీ పోలీసుల బృందం అదుపులోకి తీసుకొంది. కాగా.. ఢిల్లీలోని చత్రసాల్ స్టేడియంలో ఇరు వర్గాల రెజ్లర్ల మధ్య ఘర్షణలో సాగర్ మృతి చెందాడు. ఈ హత్య కేసులో 37 ఏళ్ల సుశీల్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న సుశీల్‌పై లుక్ అవుట్ నోటీసు కూడా జారీ అయింది. సీనియర్ రెజ్లర్ ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష, అతడి అనుచరుడు అజయ్ కుమార్ సమాచారం చెబితే రూ. 50 వేలను బహుమతిగా ఇవ్వనున్నట్టు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం సుశీల్ చేసుకొన్న దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది. ఢిల్లీకి చెందిన సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో పాటు 2012 లండన్ విశ్వక్రీడల్లో రజత పతకం సాధించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments