అబ్బో త‌మ‌న్నా...

  • IndiaGlitz, [Wednesday,December 12 2018]

బాహుబ‌లి త‌ర్వాత ... మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సినిమాలు, పాత్ర‌ల ఎంపిక‌లో చాలా పర్టికుల‌ర్‌గా ఉంటుంది. ఇప్పుడు సైరా న‌ర‌సింహారెడ్డిలో త‌మ‌న్నా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లోనే త‌మ‌న్నా పాత్ర‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. అందుకోసం త‌మ‌న్నా లుక్ టెస్ట్ చేశార‌ట‌. ఈ పాత్ర కోసం 15-20 లుక్ టెస్ట్ చేయ‌డం విశేషం... అని అంటున్నారు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు.

చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌. కాగా త‌మ‌న్నా న‌టించిన క్వీన్ రీమేక్ ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.