స్ప్రైట్‌లో పురుగులు.. కంగుతిన్న జనం
Send us your feedback to audioarticles@vaarta.com
శీతల పానీయాల్లో ఈ మధ్య ఎక్కడ చూసినా పురుగులు ప్రత్యక్షమవుతున్నాయ్. సదరు కూల్ డ్రింక్స్ తయారు చేసే ముందు.. ప్యాకింగ్ చేసేముందు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బీర్ బాటిల్స్‌లో పురుగులు వచ్చాయ్..? కూల్ డ్రింక్స్‌లో బొద్దింకలు అని.. ఇలా చాలా సార్లు పేపర్లలో, టీవీల్లో చూసే ఉంటాం. అయితే ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా సదరు యాజమాన్యంలో మాత్రం ఏ మాత్రం చలనం రావట్లేదు.. తగు జాగ్రత్తలు తీసుకోవడంలో పదే పదే విఫలమవుతున్నారు.
తాజాగా.. హైదరాబాద్‌లోని ఐ మ్యాక్స్ పక్కనున్న ప్యారడైజ్ హోటల్‌లో ఓ వ్యక్తి స్ప్రైట్ కూల్ డ్రింక్ తీసుకున్నాడు. తాగేందుకు మూత తియ్యగా పురుగు చూసిన ఆయన షాకయ్యాడు. వెంటనే ఈ విషయం ఆ షాపు సిబ్బందికి చెప్పగా వారు నోరు మెదపలేదు. ఈ క్రమంలో షాపు సిబ్బందిపై ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఇలా చేస్తే ఎలా..? జనాలను చంపేస్తారా..? అంటూ కన్నెర్రజేశాడు. సదరు వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో హోటల్‌లోని మిగిలిన జనాలు కూడా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూల్ డ్రింక్స్ కంపెనీలు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదని జనాలు, నిపుణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments