వరల్డ్ స్లీప్ డే.. నిద్ర ఒక యోగం.. లేకపోవడం రోగం
Send us your feedback to audioarticles@vaarta.com
జీవితానికి అత్యంత అవసరమైన వాటిలో నిద్ర ఒకటి. పడుకున్న వెంటనే నిద్ర పట్టడం ఒక యోగం.. నిద్రించడం భోగం.. నిద్ర లేకపోవడం రోగం. నిజమే నిద్ర లేకుంటే వచ్చే శారీరక రుగ్మతలెన్నో. దీర్ఘకాలిక నిద్రలేమి ఊబకాయం, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు, ఆందోళన, నిరాశకు గురయ్యే ప్రమాదాలకు దారితీస్తుంది. నిజానికి జ్ఞాపకశక్తి ఏకీకరణ, నియంత్రణ, హార్మోన్ల నియంత్రణ, హృదయ నియంత్రణ ఇతర అనేక ముఖ్యమైన విధులన్నీ ఈ నిద్రతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి మనిషికి తక్కువలో తక్కువ ఐదున్నర గంటలు నిద్ర ఉండాలంటారు. ఇక రోజుకి 8 గంటలు నిద్ర పోయే వారికి తిరుగుండదు. నిద్ర మరీ ఎక్కువైనా డేంజరే.
ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఇవాళ అంటే మార్చి 19.. ప్రపంచ నిద్ర దినోత్సవం. 14 ఏళ్లుగా ఈ రోజును ప్రపంచ నిద్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దీని నినాదం.. ‘రెగ్యులర్ స్లీప్.. హెల్దీ ఫ్యూచర్’. మరియు అనేక ఇతర ముఖ్యమైన విధులు వంటి అనేక శారీరక వ్యవస్థలతో నిద్ర ఉంటుంది. ప్రపంచ నిద్ర దినోత్సవం మార్చి 19 నిర్వహిస్తారు. నిద్రకు.. ఆరోగ్యానికి చాలా పెద్ద లింక్ ఉందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో యాంటిడిప్రెసెంట్, యాంటీయాంగ్జైటీ, నిద్రలేమి నిరోధక మందుల వాడకం బాగా పెరిగిందట. ముఖ్యంగా ఈ వాడకం 2020 ఫిబ్రవరి - డిసెంబర్ మధ్య 21 శాతం పెరిగిందని అధ్యయన నివేదికలో వెల్లడైంది.
అలాగే కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ప్రజానీకం ఎక్కువ కొత్త నిద్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారని అధ్యయనంలో తేలింది. 70% మంది కొత్త నిద్ర సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. తగిన అవకాశం, సమయం ఉన్నప్పటికీ, నిద్రపోలేకపోవడం వంటివి తరచూ జరుగుతుంటాయి. ఇది మానసికంగా కూడా దెబ్బ తీస్తుంది. శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి నిద్రకు మంచి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పగటి నిద్ర 45 నిమిషాలకు మించకూడదని చెబుతున్నారు. నిద్రవేళకు 4 గంటల ముందు మద్యం అధికంగా తీసుకోవద్దని.. ధూమపానం చేయవద్దని.. కెఫిన్ మానుకోవాలని సూచిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout