ఈ నెల 15న ప్రపంచకప్‌ జట్టు ప్రకటన.. నాలుగో బ్యాట్స్‌మెన్‌‌ ఎవరో..!?

వరల్డ్‌కప్‌‌కు భారత్ మే నెలలో తలపడనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రపంచకప్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మరోవైపు ఈ జట్టులో ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టును ఏప్రిల్-15న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం నాడు బీసీసీఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్వహించింది.

ఈ సమావేశానికి సీఓఏ సభ్యులతో పాటు బోర్డు తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్‌ చౌదరి, కోశాధికారి అనిరుధ్‌ చౌదరిలు హాజరై ఎవరెవర్ని జట్టులోకి తీసుకోవాలనే దానిపై నిశితంగా చర్చించారు. కాగా ఈ నెల 15న జట్టు సభ్యులను ప్రకటించే విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మే 30 ఇంగ్లండ్, వేల్స్‌లలో ప్రపంచకప్ ప్రారంభం కానుంది.

తుది జట్టు అప్పుడే...

ఇప్పటికీ నాలుగో నంబర్‌ బ్యాట్స్‌మన్‌, నాలుగో పేస్‌ బౌలర్‌ స్థానాల విషయంలో భారత్ సందిగ్ధంలో ఉంది. కాగా.. భారత జట్టు కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని సంప్రదించిన తర్వాతే తుది జట్టు ప్రకటన ఉంటుందని ఆయన మీడియాకు వివరించారు. అయితే నాలుగో నంబర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌ ప్రధాన పోటీదారులుగా ఉన్న విషయం తెలిసిందే.