హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ వన్ ప్లస్ స్టోర్ నిర్మాణం
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో అతిపెద్ద స్టోర్ ప్రారంభించడానికి చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ, ఐటీ హబ్‌గా హైదరాబాద్ మారుతుండటం ఎంతో ప్రత్యేకమని వన్ ప్లస్ సంస్థ సీఈవో పెట్ లావ్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఈ స్టోర్ మొత్తం 16వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో.. ఆరు అంతస్థుల్లో స్టోర్ ఉండనుంది. అంతేకాదు.. అధునాతన సౌకర్యాల, హైదరాబాద్ సంస్కృతి కలయికతో స్టోర్ ఉండనుంది. కాగా ఈ భవనాకృతి ఫొటోను వన్ ప్లస్ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
కాగా.. బెంగళూరులోని బ్రిడ్జ్ రోడ్డులో రెండేళ్ల క్రితం ప్రారంభించిన వన్‌ప్లస్ స్టోర్ దేశంలో అతిపెద్దదిగా పేరుగాంచింది. అంతేకాదు స్మార్ట్ ఫోన్ విడి భాగాలు తయారికి గాను దేశ రాజధాని ఢిల్లీ, తమిళనాడు రాజధాని చెన్నైలోను ప్రారంభించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ముంబై, పూనేలో ఇప్పటికే వన్‌ప్లస్‌కు సంబంధించిన స్టోర్లు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్ లాంచ్ సంస్థకు చెందిన అధికారులు తెలిపారు.
ఇలా నిర్మించబోతున్నారు..!
ఇదిలా ఉంటే.. ఇప్పటికే హైదరాబాద్‌లో వన్‌ప్లస్ కంపెనీకి చెందిన ఆర్& డీ సెంటర్ ఉంది. ఇది గత ఏడాదే ప్రారంభించారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్మించనున్న స్టోర్ రూపకల్పనలో రెండు లేయర్స్ ఉన్నాయని.. బయటి లేయర్ ఆధునిక హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వచ్ఛమైన తెలుపు ముగింపును కలిగి ఉంటుంది. ఇది నానో టెక్నాలజీతో తయారు చేసిన వైట్ కలర్ ధూళిని తట్టుకోగలదని.. సుదీర్ఘకాలం స్పష్టంగా ఉంటుంది. లోపలి వైపు ఎర్రటి ఇటుక గోడ హైదరాబాద్ సాంప్రదాయతను సూచించే విధంగా నిర్మించనున్నారు. ఇందులో ముఖ్యమైన భాగం నాచురల్ లైట్ ఉపయోగిస్తామని సదరు కంపెనీ ప్రకటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments