మహిళలూ.. ఈ వార్త నమ్మకండి: షాద్‌నగర్ పోలీస్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా టీకా ఇక మీదట ప్రతి ఒక్కరికీ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మహిళలు ఎలాంటి సమయంలో వ్యాక్సిన్ తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహిళలు పిరియడ్స్‌ను చెక్ చేసుకున్న మీదటే వ్యాక్సినేషన్ తీసుకోవాలని.. లేదంటే ఇమ్యూనిటీ సమస్యకు గురి కావల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ తొలుత మన ఇమ్యూనిటీని తగ్గించి అనంతరం తిరిగి పెంచుతుందని.. కాబట్టి పిరియడ్స్ సమయంలో వ్యాక్సినేషన్ తీసుకుంటే అది చాలా డేంజర్‌గా పరిణమిస్తుందని సదరు న్యూస్ సారాంశం.
దీనిని ఖండిస్తూ షాద్ నగర్ పోలీసులు ఒక ప్రకటనను ట్విటర్ వేదికగా విడుదల చేశారు. కరోనా టీకాకు సంబంధించి వైరల్ అవుతున్న న్యూస్ ఫేక్ అని దానిని నమ్మ వద్దని పోలీసులు చెబుతున్నారు. ‘‘కరోనా టీకాకు సంబంధించి ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలు పిరియడ్స్‌కు 5 రోజుల ముందు.. 5 రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవద్దని దాని సారాంశం. ఆ టైంలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని అందుకే టీకా వద్దని అందులో ఉంది. పిరియడ్స్ సమయంలో టీకా తీసుకుంటే రిస్కు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయాలను అస్సలు నమ్మవద్దు. ప్రభుత్వం, డాక్టర్లు దీన్ని ఇంతవరకూ నిర్ధారించలేదు’’ అని షాద్ నగర్ పోలీసులు ట్వీట్‌లో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments