నాన్ వెజ్ పిజ్జా ఇస్తావా?.. రూ.కోటి కట్టాలంటూ కోర్టుకెక్కిన మహిళ
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ రోజుల్లో సంప్రదాయం.. చట్టుబండలంటూ పెద్దగా ఎవరూ మడిగట్టుకుని కూర్చోవట్లేదు. శుబ్బరంగా దొరికిన కాడికి వెజ్జా.. నాన్ వెజ్జా అనేది చూసుకోకుండా లాగించేస్తున్నారు. అయితే అంతా ఇలా ఉన్నారనుకుంటే తప్పులో కాలేసినట్టే కొందరు మాత్రం సంప్రదాయాన్ని ప్రాణంగా చూసుకునే వారూ ఉన్నారు. అలాంటి వారి చేత ఏమరపాటులో నాన్ వెజ్ తినిపిస్తే ఇక అంతే సంగతులు. ఆ విషయం వారికి అర్థమయ్యిందో విషయం ఎలా ఉంటుందంటే.. ఇదిగో ఇలాగే ఉంటుంది.
ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దీపాళి త్యాగి అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. అయితే ఆమె గతేడాది హోళి పండగ రోజున ఆకలితో ఉన్న తన పిల్లలకోసం అమెరికన్ పిజ్జా రెస్టారెంట్ నుంచి వెజ్ పిజ్జాను ఆర్డర్ చేసింది. ఆ ఆర్డర్ ఆమెకు ఒక అరగంట ఆలస్యంగా డెలివరీ చేశారు. పోనీలే పాపం అనుకుని.. ఆర్డర్ తెచ్చినతనికి డబ్బులిచ్చి పంపించేసింది. త్యాగి ఆమె పిల్లలు ఆకలితో ఉన్నారేమో గబగబా ఆర్డర్‌ను ఓపెన్ చేసి తింటుండగా.. పిజ్జాలో మాసం ముక్కలు పంటికి తగిలాయి. తాను ఆర్డర్ చేసింది వెజ్ పిజ్జా. కానీ మష్రూమ్స్ స్థానంలో ఏమరపాటులో రెస్టారెంట్ వాడు మాంసం వేసి అందించాడు. అంతే త్యాగికి కోపం నషాళానికి అంటింది.
దీనిపై ఆమె అదే ఏడాది మార్చి 26న కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. మేనేజర్ ఉచితంగా వెజ్ పిజ్జాను పంపుతానని ఆఫర్ చేసినట్లు తెలిపింది. కానీ ఇది అంత చిన్న విషయం కాదు.. తన సంప్రదాయాలను దెబ్బతీయడమేనని ఆమె భావించింది. తనను మానసిక క్షోభకు గురి చేసినందుకుగానూ కోటి రూపాయలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తూ రెస్టారెంట్ ఓనర్‌ను కోర్టుకు లాగింది. నాన్‌వెజ్ పిజ్జా ఇచ్చి చీట్ చేశాడంటూ ఇందుకు తనకు కోటి రూపాయల పరిహారం చెల్లించాల్సిందేనంటూ వినియోగదారుల వివాద పరిష్కార కోర్టుకెక్కింది. అయితే మహిళ ఫిర్యాదుపై స్పందించాలంటూ ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ సదరు పిజ్జా సంస్థను ఆదేశించింది. అనంతరం దీనిపై ఈ నెల 17న విచారణ జరపనున్నట్లు తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments