త‌నుశ్రీద‌త్తాకు షాకిచ్చిన మ‌హిళా క‌మీష‌న్‌

  • IndiaGlitz, [Tuesday,November 20 2018]

మీ టూ ఉద్య‌మానికి త‌నుశ్రీద‌త్తా చేసిన ఆరోప‌ణ‌లు ఆజ్యం పోశాయి. సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్‌పై త‌నుశ్రీద‌త్తా చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నానికి దారి తీశాయి. ఒక‌రిపై ఒక‌రు కేసులు కూడా పెట్టుకున్నారు. కేసులు న‌డుస్తున్నాయి. ముంబై మ‌హిళా కమీష‌న్‌ను త‌ను శ్రీ సంప్ర‌దించింది. అయితే క‌మీష‌న్ నానా ప‌టేక‌ర్‌ఫై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు.

అయితే త‌మ‌కు త‌ను శ్రీ ద‌త్తా నుండి పూర్తి వివ‌రాలు రాలేదు కాబ‌ట్టే ఏ చ‌ర్య‌లు తీసుకోలేద‌ని క‌మీష‌న్ తెలియజేసింది. ఈ విష‌యంపై త‌ను శ్రీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. నేను చెప్పాల‌నుకున్న విష‌యాల‌ను చెప్పి ఎఫ్ ఐ ఆర్‌లో పొందు ప‌రిచాను. ఎఫ్ఐఆర్‌లో అన్నీ వివ‌రాలు ఉంటాయి. అయితే పూర్తి వివ‌రాలు లేవంటూ ఎఫ్ఐఆర్‌ని వెన‌క్కి పంపారు. న్యాయం చేయ‌లేన‌ప్పుడు న‌న్ను ఎందుకు పిలిచారు. న‌న్ను బాధ‌పెట్టానికా? జ‌రిగిన అన్యాయం బ‌య‌ట‌కు చెప్పిన‌ప్ప‌టి నుండి స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి.

అందుకనే భార‌త‌దేశంలో అమ్మాయిలు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు బ‌య‌ట పెట్ట‌డానికి భ‌య‌ప‌డ‌తారు. నాకు న్యాయ వ్య‌వ‌స్థ‌పై, మ‌హిళా సంఘాల‌పై న‌మ్మ‌కం లేదు. 30 ఏళ్ల క్రితం భ‌న్వ‌రీ దేవి అనే సామాజిక వేత్త‌ను మాన‌భంగం చేసి చంపేస్తే ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెకు న్యాయం జ‌ర‌గ‌నే లేదు. ఆమెకే జ‌ర‌గ‌న‌ప్పుడు నాకేం జ‌రుగుతుంది.

ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానంలో మార్పు వ‌స్తే కానీ దేశం బాగుప‌డ‌దు. నేను కేసు పోరాడ‌లేక అమెరికా వెళ్లిపోతాన‌ని నానా ప‌టేక‌ర్ అనుకుంటున్నాడేమో .. ఎప్ప‌టికైనా న్యాయం గెలుస్తుంది. నానా చూస్తుండు.. నువ్వు చేసిన పాపాల‌కు వేరే రకంగానైనా శిక్ష అనుభ‌విస్తావ్‌' అని మెసేజ్ పెట్టారు త‌ను శ్రీ.

More News

భారీ విరాళం ప్రకటించిన నిర్మాత

త‌మిళ‌నాడు తీర ప్రాంతాలోని ప్ర‌జ‌లు గ‌జ తుపాను కార‌ణంగా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఆస్థి న‌ష్టం, ప్రాణ న‌ష్టం జ‌రిగింది.

లవ్ అండ్ టెక్నాలజీ మిళితమైన డిఫరెంట్  ఫిలిం 'అనగనగా ఒక ప్రేమ కథ'- నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు

ఆయనకు తెలుగు చలనచిత్ర రంగం తో విశేషమైన అనుబంధం ఉంది... పరిశ్రమలోని ప్రముఖులు అందరికీ ఆయన సుపరిచితులు.

కార్తి కోసం రాజ‌మౌళి తండ్రి

బాహుబ‌లి, బ‌జ‌రంగీ బాయ్‌జాన్ చిత్రాల‌కు క‌థ‌ను అందించిన విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ మ‌ధ్య కాలంలో త‌మిళంలో మెర్స‌ల్‌(అదిరింది) హిందీలో మ‌ణిక‌ర్ణిక చిత్రాల‌కు క‌థ‌, క‌థ‌నాన్ని అందించారు.

ర‌కుల్ ఇదేం ప‌ని .. అక్క‌డ కూడా కాపీనా...

సాధార‌ణంగా మ‌న ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, హీరోలు, ర‌చ‌యితలు వేరే సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన క‌థ‌లను కొట్టేస్తుంటారు.

సైరా కోసం బ‌న్ని...

చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'సైరా న‌ర‌సింహా రెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్ర‌మిది.