తనుశ్రీదత్తాకు షాకిచ్చిన మహిళా కమీషన్
Send us your feedback to audioarticles@vaarta.com
మీ టూ ఉద్యమానికి తనుశ్రీదత్తా చేసిన ఆరోపణలు ఆజ్యం పోశాయి. సీనియర్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీదత్తా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనానికి దారి తీశాయి. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. కేసులు నడుస్తున్నాయి. ముంబై మహిళా కమీషన్‌ను తను శ్రీ సంప్రదించింది. అయితే కమీషన్ నానా పటేకర్‌ఫై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అయితే తమకు తను శ్రీ దత్తా నుండి పూర్తి వివరాలు రాలేదు కాబట్టే ఏ చర్యలు తీసుకోలేదని కమీషన్ తెలియజేసింది. ఈ విషయంపై తను శ్రీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. "నేను చెప్పాలనుకున్న విషయాలను చెప్పి ఎఫ్ ఐ ఆర్‌లో పొందు పరిచాను. ఎఫ్ఐఆర్‌లో అన్నీ వివరాలు ఉంటాయి. అయితే పూర్తి వివరాలు లేవంటూ ఎఫ్ఐఆర్‌ని వెనక్కి పంపారు. న్యాయం చేయలేనప్పుడు నన్ను ఎందుకు పిలిచారు. నన్ను బాధపెట్టానికా? జరిగిన అన్యాయం బయటకు చెప్పినప్పటి నుండి సవాళ్లు ఎదురవుతున్నాయి.
అందుకనే భారతదేశంలో అమ్మాయిలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బయట పెట్టడానికి భయపడతారు. నాకు న్యాయ వ్యవస్థపై, మహిళా సంఘాలపై నమ్మకం లేదు. 30 ఏళ్ల క్రితం భన్వరీ దేవి అనే సామాజిక వేత్తను మానభంగం చేసి చంపేస్తే ఇప్పటి వరకు ఆమెకు న్యాయం జరగనే లేదు. ఆమెకే జరగనప్పుడు నాకేం జరుగుతుంది.
ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వస్తే కానీ దేశం బాగుపడదు. నేను కేసు పోరాడలేక అమెరికా వెళ్లిపోతానని నానా పటేకర్ అనుకుంటున్నాడేమో .. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. నానా చూస్తుండు.. నువ్వు చేసిన పాపాలకు వేరే రకంగానైనా శిక్ష అనుభవిస్తావ్` అని మెసేజ్ పెట్టారు తను శ్రీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout