యావత్ భారత్‌ను కంటతడిపెట్టించిన మహిళా ఫైలట్‌..

  • IndiaGlitz, [Saturday,March 02 2019]

భార్య భర్తలిద్దరూ ఇండియన్‌‌ ఎయిర్‌ఫోర్స్‌లో స్క్వాడ్రన్‌ లీడర్‌‌‌‌‌లు. భారత్ గడ్డపై పుట్టినందుకుగాను దేశానికి తమవంతుగా సేవ చేయాలని భావించి ఇద్దరూ ఎయిర్‌‌ఫోర్స్‌‌లో చేరారు. అయితే ఊహించని ఘటనలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య కన్నీరుమున్నీరైంది. ఆమె కన్నీటి ధారను చూసిన తోటి ఉద్యోగులు, కుటుంబీకులు చలించిపోయారు.. ఆమెను ఓదార్చడం వారి వల్ల కాలేదు. అయితే ఆ బాధను దిగమింగి తన వృత్తిని మరవని భార్య యూనిఫామ్‌‌ ధరించి భర్త అంత్యక్రియలకు హాజరై అధికారులతో కలిసి నివాళులు అర్పించింది. ఈ దృశ్యం చూసిన వారంతా కంటతడిపెట్టుకున్నారు. ఈ విషయం టీవీల్లో, వార్తలు చదివిన యావత్ మహిళా లోకం కంటతడిపెట్టింది.

వివరాళ్లోకెళితే...

పుల్వామా ఘటన అనంతరం రెండ్రోజుల గ్యాప్‌‌‌లో.. జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లాలో ఎంఐ-17 ఛాపర్‌ సాంకేతిక సమస్యలతో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు ఫైలెట్లు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు స్క్వాడ్రన్‌ లీడర్‌ సిద్ధార్థ్‌ వశిష్ట్‌. ఈ వాయుసేనుడి స్వస్థలం చంఢీఘడ్. సిద్ధార్థ్, ఆర్తీసింగ్‌ ఇద్దరూ స్క్వాడ్రన్‌ లీడర్‌లు.శుక్రవారం నాడు సిద్ధార్థ్ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంతిమ సంస్కారాలకు వేలాదిమంది పౌరులు, అధికారులు, రాష్ట్ర మంత్రులు తరలివచ్చారు. భార్య ఆర్తీ ఓ వైపు కన్నీటి ధార.. మరో పట్టలేనంత బాధ అన్నింటినీ దిగమింగుకుని యూనిఫామ్‌‌తోనే అంత్యక్రియలకు హాజరై దేశభక్తిని చాటుకున్నారు.

ఆమె భర్త భౌతికకాయం వైపు చూస్తూ కన్నీటిని ఆపులేకపోయారు.. ఆమె రోధన చూసిన అక్కడి వారంతా కంటతడిపెట్టేశారు. చేతిలో జాతీయ పతాకం.. ఆమె కళ్లలో నుంచి వస్తున్న కన్నీటి ధార ఈ దృశ్యాన్ని చూసిన జనాలు చలించిపోయి కన్నీరుపెట్టారు. జరగాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత సిద్ధార్థ్ తండ్రి.. కుమారుడి చితికి నిప్పుపెట్టారు. ప్రస్తుతం ఈ అంత్యక్రియల దగ్గర చిత్రీకరించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఈ దృశ్యాల్లో ఆర్తీసింగ్‌‌ను చూసిన నెటిజన్లు, యావత్ ప్రపంచం మెచ్చుకుంటుండగా.. ఆమె పరిస్థితిని చూసి కంటతడిపెట్టిన వారు లేకపోలేదు. నిన్నటి వరకు అభినందన్‌‌ గురించి భారత్ తలచుకోగా.. ఇప్పుడు జయహో ఆర్తీసింగ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మీ రుణం తీర్చుకోలేనిది.. మీకు ఎల్లప్పుడు ఈ భారత్ తోడునీడగా ఉంటుంది మేడమ్ అంటూ పలువురు పౌరులు ఆమెకు భరోసానిస్తున్నారు.