ఉబర్ డ్రైవర్ మాస్క్ పెట్టుకోమన్నందుకు రచ్చ రచ్చ చేసిన మహిళలు
Send us your feedback to audioarticles@vaarta.com
కొందరి ప్రవర్తన ఎదుటి వారికి ఎంత ఇబ్బందికరంగా పరిణమిస్తుందో చెప్పేందుకు ఈ న్యూసే ఉదాహరణ. అసలే కరోనా సమయం.. ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. అందునా ఆ స్ట్రెయిన్.. ఈ స్ట్రెయిన్ అంటూ రకారకాల స్ట్రెయిన్లు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ సమయంలో ముగ్గురు మహిళల ప్రవర్తన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ముగ్గురు మహిళలు ఉబెర్ కారు ఎక్కారు. ఆ కారుకు భారత సంతతికి చెందిన శుభాకర్ డ్రైవర్గా ఉన్నారు. శుభాకర్ కారు ఎక్కిన ముగ్గురు మహిళలకూ మాస్క్ లేకపోవడంతో వారిని మాస్క్ పెట్టుకోవాలని సూచించాడు.
మాస్క్ పెట్టుకున్నాకే వాహనాన్ని స్టార్ట్ చేస్తానని తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు మహిళలూ రచ్చరచ్చ చేశారు. శుభాకర్ను దూషించడమే కాకుండా దాడికి పాల్పడ్డారు. ఒక యువతి నేరుగా డ్రైవర్ సమీపంలోకి వచ్చి గట్టిగా దగ్గింది. అంతేకాదు.. అతని మొబైల్ని తీసి విసిరికొట్టింది. శుభాకర్తో ఆ ముగ్గురు మహిళలు ప్రవర్తించిన తీరు మొత్తం వీడియోల్లో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. అక్కడి మీడియా సైతం దీనిపై ఫోకస్ చేయడంతో విషయం మరింత వైరల్ అయింది. తాను భారతీయుడిని కావడం వల్లే యువతులు దురుసుగా ప్రవర్తించారని డ్రైవర్ శుభాకర్ ఆరోపించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com