అమలాపాల్‌ను లిప్ లాక్ చేసిన అమ్మాయి
- IndiaGlitz, [Saturday,July 06 2019]
డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్‌ను పెళ్లి చేసుకుని, మూడేళ్లు తిరగకముందే విడాకులు తీసుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ కమ్రంలో అమలాపాల్ చేసిన తాజా చిత్రం 'అడై' సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తుంది. తెలుగులో చరిత చిత్ర బ్యానర్‌పై తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌లో అమలాపాల్ బోల్డ్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కథ, కథనం ఆసక్తికరంగా ఉంటుందనే అంచనాలు పెరిగాయి.
తాజాగా ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విడుదల చేశారు. ఇందులో సన్నివేశాల్లో అమలాపాల్ ఇప్పటి వరకు నటించిన వాటి కంటే నెక్ట్స్ లెవల్లో అనేలా డేరింగ్‌గా నటించింది. మందు తాగడం, సిగరెట్స్ కాల్చడం వంటి సీన్స్‌తో పాటు వి.జె.రమ్యతో అమలాపాల్ లిప్ లాక్ చేసేలా ఉండే సన్నివేశం మరింత సంచనాలకు తావిస్తుంది. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సక్సెస్‌ను సాధిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.