Durgam Cheruvu Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య.. పోలీసుల గాలింపు చర్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల మాదాపూర్ వద్ద నూతనంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఓ యువతీ దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఇదే సమయంలో అక్కడ వున్న సందర్శకులు, ప్రజలు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన లేక్ పోలీసులు యువతి కోసం స్పీడ్ బోట్ల ద్వారా తీవ్రంగా గాలిస్తున్నారు. బాధితురాలు నలుపు రంగు డ్రెస్ ధరించి వుందని.. పాతిక నుంచి 30 ఏళ్ల వయసు వుండవచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
డిప్రెషన్, కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య:
అనంతరం పోలీసులు ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను పరిశీలించగా అందులో ఓ ప్రిస్క్రిప్షన్ లభించింది. బాధితురాలిని ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న స్వప్నగా గుర్తించారు. దీని ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. డిప్రెషన్, కుటుంబ సమస్యల కారణంగానే స్వప్న ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.
కేబుల్ బ్రిడ్జి రాకతో ట్రాఫిక్‌కు చెక్:
ఇకపోతే... తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కేబుల్ బ్రిడ్జిని రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించిన సంగతి తెలిసిందే. 2020 సెప్టెంబర్ 25న దీనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్‌లు ప్రారంభించారు. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి కారణంగా మాదాపూర్- జూబ్లీహిల్స్‌ల మధ్య దూరం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు చెక్ పడింది. అమెరికా, యూరప్, రష్యా, హాంకాంగ్‌లకు చెందిన పలు అంతర్జాతీయ సంస్థలు కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను అనుమతిస్తున్నారు. శని, ఆదివారాల్లో వాహనాల రాకపోకలపై అధికారులు నిషేధం విధించారు. ఆ రోజున కేవలం పాదచారులను మాత్రమే అనుమతిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments