మహేష్ లేకుండానే..
Send us your feedback to audioarticles@vaarta.com
భరత్ అనే నేను చిత్రంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ముఖ్యమంత్రి భరత్ రామ్ పాత్రలో మహేష్ అభినయానికి సర్వత్రా మంచి స్పందన వచ్చింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. కథానాయకుడిగా మహేష్ నటిస్తున్న 25వ చిత్రమిది.
ప్రస్తుతం భరత్ అనే నేను సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న మహేష్.. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని తెలిసింది. అయితే.. సినిమా షూటింగ్ మాత్రం మే నుంచి ప్రారంభం కానుందని సమాచారం.
ఫస్ట్ షెడ్యూల్‌ని మహేష్ లేకుండానే పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎక్కువ శాతం అక్కడే జరుగనుంది. తొలి షెడ్యూల్ కూడా అమెరికాలోనే మొదలవుతుందని సమాచారం.
పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com