'జనసేన' లేనిదే తెలుగు రాష్ట్రాల రాజకీయాలుండవ్

  • IndiaGlitz, [Monday,February 25 2019]

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలుండటంతో జనసేనాని జోరు పెంచారు. ఇప్పటికే కోస్తాఆంధ్రలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు, ఆత్మీయుల సమావేశాలు పెట్టి జనసైన్యం, అభిమానులు, కార్యకర్తల్లో నూతనం ఉత్సాహం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా రాయలసీమ పర్యటన షురూ చేశారు. ఇందులో భాగంగా మొదట కర్నూలు జిల్లాలో మూడ్రోజుల పాటు పర్యటించాలని పవన్ భావించారు.

ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ పర్యటన భారీ రోడ్‌‌షోతో ప్రారంభమైంది. తమ అభిమాన హీరో, నేత వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పవన్ రాకతో జనసైన్యంతో కర్నూలు రోడ్లన్నీ కిటకిటలాడాయి. భారీగా జనసైనికులు కర్నూలు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌‌పై అభిమానులు పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. కొండారెడ్డి బురుజు సభావేదికగా పవన్ కీలక ప్రసంగం చేశారు.

జనసేన లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని కొండారెడ్డి బురుజు సాక్షిగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. పెద్దలు టీజీ వెంకటేశ్ ఫ్యాక్టరీలు నుంచి కాలుష్యం అవుతోందని.. వారితో మాట్లాడి కాలుష్యం ఆపుదామన్నారు.

పవన్ స్పీచ్ హైలైట్స్:

కొండారెడ్డి బురుజు మార్పుకు బురుజు. అన్యాయానికి ఎదురుతిరిగిన బురుజు. నేతల అనుభవం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడితే బాగుండేది.. నిజంగా అద్భుతం జరిగిందని అనిపించేది. ఆడపడుచులు రోడ్డు మీదకు వచ్చి మార్పు కోరుకుంటున్నారు. యువత ఉద్యోగాలు కోరుకుంటున్నారు. ప్రజలు రౌడీయిజం ఆగిపోవాలని కోరుకుంటున్నారు. ఆజాది స్వేచ్ఛ కావాలని యువత కోరుకుంటుంది. అధికారం ఉన్నవారికే వ్యాపారాలు, ఉద్యోగాలు వస్తున్నాయి. కుటుంబ కబంద హస్తాల్లో రాజకీయం నలిగిపోతోంది అని పవన్ వ్యాఖ్యానించారు.

మైనార్టీ ఎందుకు వాడుతున్నారు..?

మైనార్టీ అనే పదం ఎందుకు వాడతారు. ముస్లిం మతం మనదేశంలో అంతర్భాగం. ముస్లింలు ప్రత్యేకంగా దేశభక్తి చూపించాలా..? దేశం కోసం చచ్చిపోయిన ముస్లింలు లేరా..? నిజంగా దేశభక్తి ఉన్నవాళ్లు.. జనాల్ని చంపుతారా..? వీటన్నింటికీ జనసేన వ్యతిరేకంగా ఉంటుంది. మతం పేరుతో మనుషుల్ని చంపుతారా..? ప్రతి ఒక్కరూ మతం, కులం పేరుతో రాజకీయం చేస్తున్నారు. కులాల ఐక్యతకు జనసేన కృషి చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో సామాన్యులకు బరిలోకి దిగుతారు. అవినీతి కోటల్ని బద్దలు కొట్టి మార్పు తీసుకొద్దాంఅని పవన్ బల్లగుద్ది చెప్పారు.

అందరకీ సమాన ప్రాధాన్యత ఇస్తాం..

ఓట్ల కోసమే మేనిఫెస్టోలు పెడుతున్నారు. మేనిఫెస్టోలు తయారికి నేను వాళ్లలా మారలేను. 25 ఏళ్లు మీకు అండగా ఉంటాను. అవినీతి గోడలను బద్దలుకొట్టి.. కొత్త ప్రపంచాన్ని తీసుకొద్దాం. రాత్రికి రాత్రే మార్పు వస్తుందని.. తీసుకొస్తానని నేను చెప్పడం లేదు. కచ్చితంగా మార్పును తీసుకొచ్చేందుకు జనసేన పోరాడుతుంది. అందరం సంకీర్ణ ప్రభుత్వాలపై దృష్టిపెడదాం. అందర్నీ సమానంగా భావించే జనసేనను అధికారంలోకి తీసుకొద్దాం. బడ్జెట్‌లో అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తాం అని పవన్ తెలిపారు.

2019 ఎన్నికలు చాలా కీలకం..

రాయలసీమ నుంచి ఎంతో మంది సీఎంలు అయ్యారు. అయినా ఇంకా రాయలసీమ వెనుకబడే ఉంది. నాయకులంతా వారి బలం పెంచుకునేందుకు సీమను ఉపయోగించుకున్నారు. యువత ఉద్యోగాలు కల్పనపై దృష్టిపెట్టలేదు. రాయలసీమ అభివృద్ధికి నా ప్రాణాలైనా అర్పిస్తాను. జనసేనపై సంపూర్ణ విశ్వాసంతో ఓటు వెయ్యండి. జనసైనికులు అండగా ఉండే నాయకులు కావాలి. 2019 ఎన్నికలు చాలా కీలకం. నేతలంతా జనసేన ఒకరోజు టీడీపీవైపు, మరోరోజు వైసీపీ వైపు అంటారు.. జనసేన ఎప్పుడూ ప్రజలవైపు ఉంటుందిఅని పవన్ హామీ ఇచ్చారు.

ధైర్యం ఉండే వాళ్లు కావాలి..!

మార్పుకు ధైర్యం ఉండేవాళ్లు కావాలి. మార్పు రావాలని మీకు అనిపిస్తే చాలు.. జనసేన మీకు అండగా ఉంటుంది. మార్పుకోసం నా ప్రాణాలు కోల్పోయినా భయపడేది లేదు. ఈ రోజున దేశం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. యుద్ధం జరిగితే దాన్ని అవకాశంగా తీసుకుని రాజకీయాలు చేయాలని చూసే శక్తులను జనసైనికులుగా మీరంతా అడ్డుకోండి అని ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.

మీ గుండెల్లో చోటివ్వండి..

కులాన్ని, ప్రాంతాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదు. కులాల గోడలు బద్దలు కొట్టడానికి వచ్చాను. వేల కోట్లు ఉంటాయ్.. కానీ ప్రజలు జీవితాలు మాత్రం మారవ్. రాజకీయాల్లో మార్పు రావాలంటే అది మహిళలు, యువతతోనే సాధ్యం. జనసేనకు మీ గుండెల్లో స్థానం ఇవ్వండి. మీరు ఇచ్చే స్థానంతోనే నేను పోరాడుతాను. 25 ఏళ్లు నా జీవితం త్యాగం చేసి మీకు అండగా ఉంటాను అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. 25న కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ పత్తి రైతులను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. చివరి రోజు అనగా 26వ తేదీన ఆళ్ళగడ్డలో పర్యటిస్తారు.

More News

గ‌ర్వ‌ప‌డే ఆయ‌న అభిమానిని అంటూ నాని...

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సందడి చేయ‌డానికి సిద్ధ‌మైపోతున్నాడు. జెర్సీ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న నాని..

ముళ్ల పంది.. మహా లఫూట్ ఏంటీ రచ్చ ఆర్జీవీ!

అంతా నా ఇష్టం.. నేనింతే ఎవరేమన్నా, ఎవరేమనుకున్నా నాకు ఓకే.. నా దారి రహదారి కాదు అడ్డదారి.. సంచనాలకు కేరాఫ్ నేనే..

మ‌రో జ‌య‌ల‌లిత బ‌యోపిక్ రెడీ అవుతోంది...

త‌మిళ‌నాడు దివ‌తంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లితకు సంబంధించి రెండు బ‌యోపిక్స్ సెట్స్‌లో ఉన్నాయి.

సోమిరెడ్డికి కోలుకోలేని షాక్.. వైసీపీలో చేరిన సోదరుడు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల జంపింగ్‌‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌‌లు

ఇప్పుడు అల్లుడితో ....

పిజ్జా స‌క్సెస్‌తో అంద‌రి దృష్టిని త‌న వైపు తిప్పుకున్న డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌.. 'జిగ‌ర్ తండా'తో స్టార్ డైరెక్ట‌ర్‌గా మారారు.