ఒకే నెలలో రెండు సినిమాలతో..
Send us your feedback to audioarticles@vaarta.com
2009లో విడుదలైన కిక్ చిత్రం యువ సంగీత దర్శకుడు థమన్ కెరీర్‌ని మలుపు తిప్పింది. చూస్తుండగానే.. 5 ఏళ్లు తిరిగేసరికి ఆగడుతో 50 సినిమాలని పూర్తిచేశాడు. అయితే అక్కడ్నుంచే అతని హవాకి బ్రేక్ పడింది. వరుస పరాజయాలు, రొటీన్ మ్యూజిక్ అతన్ని రేసులో బాగా వెనకపడేశాయి. ఆ తరువాత ఒకటీ అరా విజయాలు దక్కినా పెద్దగా ఉపయోగపడలేదు.
ప్రస్తుతం చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు చేస్తున్నాడీ యువ సంగీత దర్శకుడు. వాటిలో నాగార్జున నటిస్తున్న రాజుగారి గది2 ఒకటి. ఇక ఈ నెలలో అయితే.. రెండు వారాల గ్యాప్‌లో రెండు సినిమాలతో పలకరించనున్నాడు థమన్. ఈ నెల 15న అతని సంగీతంలో రూపొందిన ద్విభాషా చిత్రం వీడెవడు విడుదల కాబోతుంటే.. 29న శర్వానంద్ మహానుభావుడు రిలీజ్ కానుంది. మరి ఒకే నెలలో వస్తున్న ఈ రెండు చిత్రాల్లో ఏది థమన్ కెరీర్‌కి ఉపయోగపడుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments