మిస్ అయిన డైరెక్టర్‌తో..
Send us your feedback to audioarticles@vaarta.com
'లై' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. మొదటి సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా.. 'లై' చిత్ర కథానాయకుడు నితిన్‌తోనే రెండో సినిమా కూడా చేసింది ఈ కేరళకుట్టి. 'ఛల్ మోహన్ రంగ' పేరుతో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా రిలీజ్ అయిన కాకముందే.. వరుస సినిమాలతో ఈ అమ్మడు బిజీగా మారిపోతోంది.
ఇప్పటికే అఖిల్ కథానాయకుడిగా 'తొలిప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్న మేఘా.. సాయిధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల రూపొందించనున్న సినిమాలోనూ కథానాయికగా ఛాన్స్ కొట్టేసిందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రంలోనే మేఘా రెండో కథానాయికగా నటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. లావణ్య త్రిపాఠి చేరింది. మరి.. మిస్ అయిన డైరెక్టర్ నుంచి మరో సారి కబురు అందుకున్న మేఘా.. ఈ సారైనా ఈ ఛాన్స్‌ను నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com