ఈసారి రవితేజతో..
Send us your feedback to audioarticles@vaarta.com
‘కలుసుకోవాలని’ సినిమాతో రైటర్‌గా తొలి అడుగులు వేశారు వక్కంతం వంశీ. ఆ తర్వాత ఎన్టీఆర్ (‘అశోక్’), మహేష్ బాబు (‘అతిథి’) నటించిన చిత్రాలకు కథలను అందించినప్పటికీ వంశీకి విజయం వరించలేదు. అయితే.. 2009లో రవితేజ నటించిన ‘కిక్’ సినిమాకు కథను అందించి విజయాన్ని అందుకున్నారు. అనంతరం ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించి రచయితగా తన ఖాతాలో విజయాలను వేసుకున్నారు వంశీ. ఇక రవితేజకు ‘కిక్2’(2015), ‘టచ్ చేసి చూడు’ (2018) చిత్రాలకు కూడా స్టొరీని సమకూర్చగా.. ‘టచ్ చేసి చూడు’ సినిమాలో రవితేజ పాత్రకి ప్రశంసలు లభించాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగానూ అవతారమెత్తారు వంశీ. ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్రను ఎంతో చక్కగా డిజైన్ చేసినా.. సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం రవితేజతో చేయడానికి వంశీ ప్లాన్ చేస్తున్నారు. రచయితగా తొలి విజయాన్ని రవితేజ కాంబినేషన్‌లో అందుకున్న వంశీ.. దర్శకుడిగానూ తన కాంబినేషన్‌లోనే తొలి హిట్ అందుకుంటారేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com