ఈసారి ర‌వితేజ‌తో..

  • IndiaGlitz, [Sunday,July 01 2018]

‘కలుసుకోవాలని’ సినిమాతో రైటర్‌గా తొలి అడుగులు వేశారు వక్కంతం వంశీ. ఆ తర్వాత ఎన్టీఆర్ (‘అశోక్’), మహేష్ బాబు (‘అతిథి’) న‌టించిన చిత్రాలకు కథలను అందించిన‌ప్ప‌టికీ వంశీకి విజయం వరించలేదు. అయితే.. 2009లో రవితేజ న‌టించిన‌ ‘కిక్’ సినిమాకు కథను అందించి విజయాన్ని అందుకున్నారు. అనంతరం ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించి ర‌చ‌యిత‌గా తన ఖాతాలో విజయాలను వేసుకున్నారు వంశీ. ఇక రవితేజకు ‘కిక్2’(2015), ‘టచ్ చేసి చూడు’ (2018) చిత్రాలకు కూడా స్టొరీని సమకూర్చగా.. ‘టచ్ చేసి చూడు’ సినిమాలో రవితేజ పాత్రకి ప్రశంసలు లభించాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ హీరోగా న‌టించిన‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగానూ అవ‌తార‌మెత్తారు వంశీ. ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్రను ఎంతో చ‌క్క‌గా డిజైన్ చేసినా.. సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం రవితేజతో చేయడానికి వంశీ ప్లాన్ చేస్తున్నారు. ర‌చ‌యిత‌గా తొలి విజ‌యాన్ని ర‌వితేజ కాంబినేష‌న్‌లో అందుకున్న వంశీ.. ద‌ర్శ‌కుడిగానూ త‌న కాంబినేష‌న్‌లోనే తొలి హిట్ అందుకుంటారేమో చూడాలి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

More News

మరోసారి సావిత్రిగా కీర్తి సురేష్

మహానటుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవితకథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం 'యన్.టి.ఆర్'. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తూ..

లండన్‌లో పాట పాడుతున్న అఖిల్

తొలి చిత్రం 'తొలిప్రేమ'తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు త‌న‌ తదుపరి చిత్రాన్ని అక్కినేని అఖిల్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

మ‌హేష్ సినిమా.. నెల రోజుల ఆల‌స్యం

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఉత్త‌రాది భామ పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం

డెబ్యు డైరెక్టర్‌తో అఖిల్ మల్టీస్టారర్ మూవీ?!

'నువ్వు నేను' లాంటి సూపర్ హిట్ ఫిల్మ్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి.. 'సంతోషం' సినిమాతో స్క్రీన్‌ప్లే రైటర్‌గా మారారు గోపీమోహన్.

వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా రిలీజైన 'ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌' ఆడియో

జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై  శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌ప‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్ గా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస రావు ద‌ర్శ‌క‌త్వం.