రవితేజతో మరోసారి..
Send us your feedback to audioarticles@vaarta.com
`టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు` చిత్రాలతో ఈ ఏడాది ప్రథమార్థంలో పలకరించిన మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో `అమర్ అక్బర్ ఆంటోనీ` చేస్తున్నారు. ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. విజయ దశమి కానుకగా ఈ సినిమా తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం తరువాత రవితేజ మరో రెండు చిత్రాలకు కమిట్ అయ్యారు.
వాటిలో ఒకటి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న `తెరి` రీమేక్ కాగా.. మరొకటి వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం. వి.ఐ.ఆనంద్ తెరకెక్కించనున్న చిత్రంలో రవితేజ రెండు పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాలో కథానాయికగా మాళవిక శర్మని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇప్పటికే నేలటిక్కెట్టు సినిమాలో అలరించిన రవితేజ, మాళవిక జోడీ మరో సారి తెరపై సందడి చేయనుందన్నమాట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments