ర‌వితేజ‌తో మ‌రోసారి..

  • IndiaGlitz, [Tuesday,June 26 2018]

'ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్టు' చిత్రాల‌తో ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో ప‌ల‌క‌రించిన మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' చేస్తున్నారు. ఇలియానా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. విజ‌య ద‌శ‌మి కానుక‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం త‌రువాత ర‌వితేజ మ‌రో రెండు చిత్రాల‌కు క‌మిట్ అయ్యారు.

వాటిలో ఒక‌టి సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న 'తెరి' రీమేక్ కాగా.. మ‌రొక‌టి వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న చిత్రం. వి.ఐ.ఆనంద్ తెర‌కెక్కించ‌నున్న చిత్రంలో ర‌వితేజ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాలో క‌థానాయిక‌గా మాళ‌విక శ‌ర్మ‌ని ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నేల‌టిక్కెట్టు సినిమాలో అల‌రించిన ర‌వితేజ‌, మాళవిక జోడీ మ‌రో సారి తెర‌పై సంద‌డి చేయ‌నుంద‌న్న‌మాట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.