రానాతో మాత్ర‌మే వెంట‌వెంట‌నే..

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

దర్శకుడిగా త‌న‌ తొలి సినిమా అయిన‌ ‘చిత్రం’తోనే ఘ‌న విజ‌యాన్ని అందుకున్నారు తేజ. ఆ త‌రువాత వ‌చ్చిన‌ ‘నువ్వు నేను’, ‘జయం’ సినిమాలతో  ఈ దర్శకుడి గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే.. ఆ తరువాత వరుస ఫ్లాపుల కారణంగా చాలా కాలం సక్సెస్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో  గ‌తేడాది ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా రూపంలో మళ్ళీ విజయం వరించింది. రానా, కాజల్ అగర్వాల్  జంట‌గా నటించిన ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ బాట పట్టారు తేజ. ప్రస్తుతం తన తదుపరి చిత్రం మళ్ళీ రానాతోనే ప్లాన్ చేసుకుంటున్నారు ఈ దర్శకుడు. ఈ చిత్రం  దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో.. 1971 ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో రూపుదిద్దుకోబోతోందని సమాచారం.

తేజ కెరీర్‌ను ఒక్కసారి గమనిస్తే.. ఆయన ఇంతవరకు ఉదయ్ కిరణ్, నితిన్‌తో మాత్రమే రెండు సార్లు  లేదా అంతకు మించి సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిలో ఉదయ్ కిరణ్‌తో మూడు సినిమాలు (‘చిత్రం’ (2000), ‘నువ్వు నేను’ (2001), ‘ఔనన్నా కాదన్నా’ (2005)), అలాగే.. నితిన్‌తో (‘జయం’ (2002), ‘ధైర్యం’ (2005)) రెండు చిత్రాలు చేశారు. అవి కూడా వారితో వెంట వెంటనే తెరకెక్కించినవి కావు. అయితే.. రానాతో మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను ఆయ‌న తెరకెక్కిస్తుండ‌డం విశేషం. మరి ఉదయ్ కిరణ్ లాగే రానా కూడా రెండోసారి విజయాన్ని అందుకుంటారో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

More News

'టాక్సీవాలా' రాక అప్పుడేనా?

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్ జంటగా నటించిన మూవీ ‘టాక్సీవాలా’.

పూరి మ‌న‌సు పెట్టి స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుంద‌నేది 'మెహ‌బూబా' సినిమా చూస్తే తెలుస్తుంది - దిల్‌రాజు

పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం 'మెహబూబా'.

మే11 నుంచి హైద్రాబాద్ లో 'పడి పడి లేచే మనసు' తాజా షెడ్యూల్

యంగ్ అండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "పడి పడి లేచే మనసు".

హీరో కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా 'బంగారి బాలరాజు' మొదటి పాట విడుదల

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా

సావిత్రి అంటే మహానటి కాదు. మహానటి అంటే సావిత్రి

ఈ భూమికి ఒకే ఒక ఆకాశం అలాగే చలన చిత్ర పరిశ్రమకి ఒకే ఒక సావిత్రి.సావిత్రి అంటే మహానటి కాదు. మహానటి అంటే సావిత్రి.