రాధా ఎఫెక్ట్.. వైసీపీలోకి దేవినేని..!?

  • IndiaGlitz, [Thursday,January 24 2019]

విజయవాడలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో రాష్ట్రం మొత్తం అటువైపే చూస్తోంది. వైసీపీకి గుడ్‌‌బై చెప్పిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరతారని పుకార్లు వస్తుండటంతో దేవినేని ఫ్యామిలీ అలెర్ట్ అవుతోందట. అయితే రాధా పార్టీలోకి వచ్చినప్పటికీ ఎవరి ప్రియార్టీ వారికుంటుందని ఇందులో ఎలాంటి అనుమానాలొద్దని ఓ వైపు చంద్రబాబు భరోసా ఇస్తున్నప్పటికీ.. మున్ముంథు పరిస్థితులు మారే అవకాశాలుంటాయని దేవినేని ఫ్యామిలీ అనుకుంటోందట. పార్టీలో కీలకంగా ఉన్న దేవినేని అవినాశ్‌‌కు అధిష్టానం మరోసారి తెలుగు యువత అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అయితే రాధా వస్తున్నారని తెలుసుకున్న అవినాశ్‌ అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తోంది. సరిగ్గా ఇదే టైమ్‌‌లో వెల్‌‌కమ్.. అవినాశ్.. వెల్‌‌కమ్ అంటూ వైసీపీ నేతలు అవినాశ్ ఇంట్లో వాలిపోయారట. అయితే ఈ భేటీలో ఏమేం చర్చకు వచ్చాయ్.. అనేది తెలియరాలేదు.

ఆ గట్టునుంటావా.. అవినాశ్.. ఈ గట్టుకొస్తావా..!
గుడివాడ గడ్డ మీద టీడీపీ జెండా పాతాలని గత 15ఏళ్లుగా భగీరథ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవన్నీ ఘోరంగా విఫలమవుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన కొడాలి నానీని ఢీకొట్టాలంటే యువకుడు, ఉత్సాహవంతుడైన అవినాశ్‌ను బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందని సమాచారం. అయితే అవినాశ్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ తనకు నూజివీడు టికెట్ ఇచ్చి తీరాల్సిందేనని అటు చినబాబు.. ఇటు పెదబాబును గట్టిగా పట్టుబట్టారని తెలుస్తోంది. ఎన్నికలకు నెల గడువున్నా ఈ టైమ్‌‌లో అవినాశ్‌ను గుడివాడకు పంపడమేంటి? అధిష్టానం తలా తోకా లేకుండా ఏం చేస్తోంది అని దేవినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ గట్టుకొస్తే ఎంపీ టికెట్..!
విజయవాడ ఎంపీగా ఎవర్ని బరిలోకి దింపాలా..? అని గత కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్న వైసీపీ.. ఘట్టమనేని ఆదిశేషగిరి రావు పేరు దాదాపు ఖరారైపోయింది. అయితే తనకు గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ టికెట్ కావాలని ఆయన పట్టుబట్టి ఇవ్వకపోవడంతో పార్టీ నుంచి బయటికెళ్లిపోయారు. దీంతో మరో అభ్యర్థి కోసం వేచి చూస్తున్న టైమ్‌‌లో సరిగ్గా అవినాశ్ పేరు ప్రస్తావనకు వచ్చిందట. దీంతో అవినాశ్ వైసీపీ కండువా కప్పుకుంటే విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ గట్టునుండాలా.. లేకుంటే వైసీపీ గట్టునుండాలా ? అని సమాలోచనలు చేసే పనిలో పడ్డారట అవినాశ్.

కాగా.. దేవినేని-వంగవీటి కుటుంబాలకు గత కొన్ని దశాబ్దాలకు గొడవలున్నాయ్. ఈ విషయాలన్నీ ఆర్జీవీ తెరకెక్కించిన ‘వంగవీటి’ మూవీలో చూడొచ్చు. అయితే ఇప్పుడు బద్ధ శత్రువులిద్దరూ ఒకే పార్టీలో ఉండటం అంటే కష్టమేనని భావించిన అవినాశ్.. దీపం ఉండగానే ఇళ్లు సర్దుకోవాలన్నట్లుగా.. ఎన్నికలకు ముందే తట్టా బుట్టా సర్దేసి గోడదూకేయడానికి సిద్ధమవుతారా..? లేకుంటే టీడీపీలోనే కొనసాగుతారా..? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాధా టీడీపీలోకి రాకపై ఇంత వరకూ స్పష్టత రాకపోవడంతో ఆఖరి నిమిషంలో జనసేనలో చేరొచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే జరిగితే అవినాశ్ సేఫ్.. సీన్ కాస్త రివర్స్ అయితే మాత్రం పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాల్సిందే.

More News

వైఎస్ జగన్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకో : రాధా

వైసీపీని వీడిన విజయవాడ కీలకనేత వంగవీటి రాధా.. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డికి పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. రాజీనామా, టీడీపీ నేతల భేటీ అనంతరం ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చిన రాధా

ఇందిరాగాంధీ-2 ఎంట్రీతో బీజేపీకి ముచ్చెమటలు!?

గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిణామాలతో కాంగ్రెస్‌‌కు భయం పట్టుకుందా..?

మంత్రి సోమిరెడ్డి పతనం మొదలైనట్లేనా..!?

ఏపీ మంత్రి సోమిరెడ్డి పతనం మొదలైనట్లేనా..? ఇక నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి పోటీచేసి గెలవాలన్న ఆశ ఆయనలో చచ్చిపోయిందా..?

పవన్ - టీజీ కౌంటర్ల వర్షం

టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మాట్లాడిన ‘పొత్తు’ మాటలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఇంటికొచ్చిన టీడీపీ నేతలకు షాకిచ్చిన వంగవీటి రాధా!?

వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా ఏ పార్టీలో చేరాలో తేల్చులేకపోతున్నారు.