సీఎం జగన్ ఆదేశాలతో 72 గంటల్లోనే మత్స్యకారులకు పరిహారం అందజేత

  • IndiaGlitz, [Monday,November 27 2023]

ఏదైనా ప్రకృతి విపత్తలు సంభవించినా.. లేదంటే మానవ తప్పిదాల వల్ల ఘోర ప్రమాదాలు జరిగినా గత ప్రభుత్వాలు చేసే హడావిడి అంతాఇంతా కాదు. అధికారులు వచ్చి ప్రమాదం ఆస్తినష్టం అంచనాలు వేసినట్లు నటించడం.. తప్పకుండా బాధితులను ఆదుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికి ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయేవారు. తర్వాత ఆ సాయం కోసం బాధితులు కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరగడంతో పాటు లంచాలు ఇవ్వడం పరిపాటిగా మారింది.

కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది.. పాలన చేస్తుంది మంచి మనసున్న నాయకుడు. ఆపద వచ్చింది అన్నా అంటే చాలు అర క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందిస్తాడు. అతనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

నవంబర్‌ 19వ తేదీ రాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్థంకాగా.. మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ బాధిత మత్స్యకారులకు 80శాతం పరిహారం ఇస్తామని ప్రకటించారు. జిల్లా అధికారులు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించడంతో 72గంటల వ్యవధిలోనే బాధితులకు పరిహారం చెల్లించినట్టు జిల్లా కలెక్టర్ మల్లికార్జున వివరించారు.

ఈ ఘటనకు సంబంధించి 49 మంది బాధిత మత్సకార కుటుంబాలకు రూ.7 కోట్ల 11 లక్షల 76 వేలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా బోట్లు తగులబడటంతో ఉపాధిని కోల్పోయిన కళాసీలకు సైతం రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించారు. దీనివల్ల దాదాపు 400 మంది కలాశీలకు ప్రయోజనం చేకూరింది. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తోడుగా నిలిచేవాడే అసలైన పాలకుడు. అది చేతల్లో చేసి చూపిస్తున్నారు మన రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి.

More News

Rythu Bandhu:బిగ్ బ్రేకింగ్: రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.  రైతులకు 'రైతుబంధు'

Sampath Kumar:కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో అర్థరాత్రి హైటెన్షన్..

పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ప్రచారం హీటెక్కుతోంది. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Rahul Gandhi:మోదీ-కేసీఆర్ ఒక్కటే.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజాపాలన చూపిస్తాం: రాహుల్ గాంధీ

బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో ప్రధాని మోదీకి కేసీఆర్ సహకరిస్తారు..

Modi: కేసీఆర్ అవినీతిపై విచారణ జరుగుతోంది.. వదిలే ప్రసక్తే లేదు: మోదీ

కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోదీ తెలిపారు. నిర్మల్ జిల్లా తూప్రాన్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ

Pawan Kalyan:తెలంగాణలో యువత ఆశలు నెరవేరలేదు: పవన్ కల్యాణ్

డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు.