ఓలింపిక్ విన్నర్‌తో
Send us your feedback to audioarticles@vaarta.com
ముకుంద, కంచె, మిస్టర్, ఫిదా, తొలిప్రేమ ఇలా జయాపజయాలకు అతీతంగా విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపే హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. ఈ మెగా క్యాంప్ హీరో సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో సక్సెస్‌ను అందుకున్నాడు. ఇప్పుడు వరుణ్ రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే `వాల్మీకి`.
తర్వాత కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. బాక్సర్‌గా కనపడే ప్రయత్నంలో భాగంగా వరుణ్ తేజ్ అమెరికా వెళ్లి అక్కడ ఓలింపిక్ బాక్సింగ్ విన్నర్ టోని జెఫ్రీస్ దగ్గర ప్రత్యేకమైన శిక్షణను తీసుకుంటున్నాడట. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడట. ఈ సినిమాను వరుణ్‌తేజ్ నిర్మించబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి.ఈ సినిమాను వరుణ్ అన్నయ్య బాబీ నిర్మిస్తుంటే.. వరుణ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తాడని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments