ఈ సారి ఏకంగా మెగాస్టార్ తో..?

  • IndiaGlitz, [Saturday,September 02 2017]

త‌న ఖాతాలో ఒక్క‌టంటే ఒక్క విజ‌యాన్ని కూడా వేసుకోలేక‌పోయినా.. అందాల న‌టి ప్రగ్యా జైస్వాల్‌కి ఏదో ఒక‌ అవ‌కాశం ఆమె ఇంటి త‌లుపు త‌డుతూనే ఉంది. వినిపిస్తున్న క‌థనాల ప్ర‌కారం.. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రంలో ప్ర‌గ్యాకి ఓ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం దొరికింద‌ని స‌మాచారమ్‌. 'సైరా న‌ర‌సింహారెడ్డి' ముగ్గురు హీరోయిన్‌ల‌కు చోటుంది. ప్రధాన నాయికగా ఇప్ప‌టికే న‌య‌న‌తార ఎంపికైంది. మ‌రో లీడ్ రోల్ ని అనుష్క చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇక ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి య‌వ్వ‌నంలో ఉన్న‌ప్పుడు అత‌న్ని ఇష్ట‌ప‌డే అమ్మాయి పాత్ర‌లో ప్ర‌గ్యా క‌నిపించ‌నుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. ఈ ఆఫ‌ర్ ఓకే అయితే ప్ర‌గ్యాకి ఇది బంప‌ర్ ఆఫ‌రే. ఇదివ‌ర‌కు మెగా ఫ్యామిలీకి చెందిన వ‌రుణ్‌తేజ్ తో 'కంచె' చిత్రంలోనూ.. సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో 'న‌క్ష‌త్రం' చిత్రంలోనూ ప్ర‌గ్యా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా చిరుతో రొమాన్స్ చేసే అవ‌కాశం వ‌స్తే.. ప్ర‌గ్యా ద‌శ తిరిగిన‌ట్టే.

More News

సాయిధరమ్ పెంచేస్తున్నాడు కానీ..

ఇప్పటివరకు ఏడు చిత్రాల్లో సందడి చేసిన మెగా ఫ్యామిలీ కథానాయకుడు సాయిధరమ్ తేజ్..

పవన్ సినిమాకి త్రివిక్రమ్ సెంటిమెంట్..

'జల్సా','అత్తారింటికి దారేది'వంటి విజయవంతమైన చిత్రాల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,

బెల్లంకొండ తరువాత రామ్ చరణ్ తోనే..

సమంత.. ఎంతోమంది యువ కథానాయకులకు కష్ట కాలంలో కలిసొచ్చిన కథానాయిక.

చేతన్ చీను 'దేవదాసి' మోషన్ పోస్టర్ విడుదల

రాజుగారి గది ఫేమ్ చేతన్ చీను,సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జర్ కలిసి నటిస్తున్న చిత్రం 'దేవదాసి'

నితిన్ కి ఆయన శిష్యుడైనా కలిసొస్తాడా?

గతేడాది 'అఆ'తో ఓ బ్లాక్బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న నితిన్ కి..