మూడోసారైనా లేడీ డైరెక్టర్ కలిసొస్తారా?
Send us your feedback to audioarticles@vaarta.com
వరుసగా మహిళా దర్శకులతో సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న కథానాయిక అమైరా దస్తూర్. అనేకుడు అనే తమిళ డబ్బింగ్ చిత్రంతో నాయికగా తొలి అడుగులు వేసిన అమైరా.. సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల ఘట్టమనేని తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న ‘మనసుకు నచ్చింది’ చిత్రం ద్వారా.. తెలుగు తెరకు నేరుగా పరిచయం అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. కట్ చేస్తే.. మరో లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి డైరెక్షన్‌లో రూపొందిన ‘రాజుగాడు’ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించింది అమైరా.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా విజయం సాధించలేదు. కాగా.. ప్రస్తుతం మరో మహిళా దర్శకురాలు లీనా యాదవ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న హిందీ చిత్రం ‘రాజ్మా చావల్’లో నటిస్తోంది అమైరా. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. మరి ఇప్పటికే రెండు సార్లు లేడీ డైరెక్టర్స్ నేతృత్వంలో పరాజయాలు చవిచూసిన అమైరాకి మూడో సారైనా విజయం వరిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments