మూడోసారైనా లేడీ డైరెక్టర్ కలిసొస్తారా?

  • IndiaGlitz, [Sunday,June 03 2018]

వరుసగా మహిళా దర్శకులతో సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్న‌ కథానాయిక అమైరా దస్తూర్. అనేకుడు అనే త‌మిళ డ‌బ్బింగ్ చిత్రంతో నాయిక‌గా తొలి అడుగులు వేసిన అమైరా.. సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల ఘట్టమనేని తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న ‘మనసుకు నచ్చింది’ చిత్రం ద్వారా.. తెలుగు తెరకు నేరుగా పరిచయం అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. క‌ట్ చేస్తే.. మరో లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి డైరెక్షన్‌లో రూపొందిన‌ ‘రాజుగాడు’ సినిమాలో కూడా హీరోయిన్‌గా న‌టించింది అమైరా.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన‌ ఈ సినిమా కూడా విజయం సాధించలేదు. కాగా.. ప్ర‌స్తుతం మ‌రో మహిళా దర్శకురాలు లీనా యాదవ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న హిందీ చిత్రం ‘రాజ్మా చావల్’లో న‌టిస్తోంది అమైరా. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. మరి ఇప్పటికే రెండు సార్లు లేడీ డైరెక్టర్స్ నేతృత్వంలో పరాజయాలు చవిచూసిన అమైరాకి మూడో సారైనా విజయం వరిస్తుందేమో చూడాలి.

More News

డబుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్న మ్యూజిక్ డైరెక్టర్

‘అర్జున్ రెడ్డి’.. సంచలనానికి మారు పేరుగా నిలిచిన సినిమా.

'తేజ్‌ ఐ లవ్‌ యు' ఫస్ట్‌ సాంగ్‌ లాంచ్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో

కోల్‌క‌త్తాలో '2 స్టేట్స్' సెకండ్ షెడ్యూల్ పూర్తి

లక్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ , ప్రొడక్షన్స్ no.1 గా  రూపొందిస్తున్న చిత్రం '2 స్టేట్స్‌' (వర్కింగ్ టైటిల్ ). చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల '2 స్టేట్స్‌' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా

తెలుగు మూవీ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ సిల్వ‌ర్‌ జూబ్లి వేడుక‌ల‌కి ముఖ్యఅతిథిగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు

తెలుగు సినిమా 24 క్రాఫ్ట్స్ లో ముఖ్య‌మైన విభాగాల్లో తెలుగు మూవీ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ ఒక‌టి..

నిఖిల్ 'ముద్ర' ఫస్ట్ లుక్ కు మంచి స్పందన

యువహీరో తాజాగా నటిస్తోన్న సినిమా ‘ముద్ర’. ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్,