close
Choose your channels

గురువుతో క‌లిసి నిర్మాత‌గా...

Saturday, December 1, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గురువుతో క‌లిసి నిర్మాత‌గా...వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప‌లు సినిమాల‌ను నిర్మించాడు. త‌న శిష్యుల‌ను ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం చేశాడు. అయితే ఈయ‌న ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌ని శిష్యుల్లో ఒక‌డైన అజ‌య్ భూప‌తి తొలి చిత్రం `ఆర్‌.ఎక్స్ 100`తో స‌క్సెస్ సాధించాడు.

ఇప్పుడు ఓ మ‌ల్టీస్టార‌ర్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. కాగా ఈయ‌న అప్పుడే నిర్మాత‌గా మారాడు. త‌న గురువు రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో క‌లిసి `పోస్ట‌ర్‌` అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ విష‌యాన్ని రామ్‌గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశాడు. మ‌రి ఈ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నే విష‌యాన్ని చెప్ప‌లేదు. త్వ‌ర‌లోనే వ‌ర్మ వివ‌రాలు ప్ర‌క‌టిస్తారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.