మ‌హిళా ద‌ర్శ‌కుల‌తోనే..

  • IndiaGlitz, [Monday,May 07 2018]

ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా కె.వి.ఆనంద్ రూపొందించిన  తమిళ అనువాద చిత్రం 'అనేకుడు'(2015)తో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ముద్దుగుమ్మ అమైరా ద‌స్తూర్‌.  ఈ ఏడాది విడుదలైన 'మనసుకు నచ్చింది' సినిమాతో టాలీవుడ్‌లో తొలి అడుగులు వేసింది. ఈ సినిమాతో మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమయ్యారు.

అయితే.. ఈ సినిమా దర్శకురాలిగా అటు మంజులకి గాని, నటిగా ఇటు అమైరాకి గాని ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమా 'రాజుగాడు' పైనే ఆశలు పెట్టుకుంది అమైరా. రాజ్ తరుణ్‌తో కలిసి నటించిన ఈ సినిమాకి  డెబ్యూ లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా జూన్ 1న విడుదల కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. తెలుగులో అమైరా చేసిన రెండు స్ట్రెయిట్ సినిమాలకి కూడా లేడీ డైరెక్టర్స్ డైరెక్ట్ చేయడమనేది విశేషమనే చెప్పాలి. మరి డెబ్యూ లేడీ డైరెక్టర్ మంజుల ఇవ్వలేని విజయం.. మరో నూతన దర్శకురాలు సంజనా రెడ్డి అయినా అమైరాకు అందిస్తారేమో చూడాలి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అమైరా నటిస్తున్న బాలీవుడ్ ఫిల్మ్ 'రాజ్మా చావల్' సినిమాకి కూడా మహిళా దర్శకురాలు లీనా యాదవ్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం.