YS Jagan: దుర్గమ్మ దీవెనలతో మహిళలు అన్ని రంగాల్లో శక్తివంతంగా ఎదగాలి: సీఎం జగన్

  • IndiaGlitz, [Tuesday,October 24 2023]

స్త్రీ లేనిదే జననం లేదు. స్త్రీ లేనిదే గమనం లేదు. స్త్రీ లేనిదే సృష్టే లేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా పలు బాధ్యతలు మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అలాంటి మహిళలకు సీఎం జగన్ అన్నలా, తమ్ముడిలా భరోసా కల్పిస్తున్నారు. జగనన్న పాలనలో మహిళలు మహారాణులుగా వెలిగొందుతున్నారు. రాష్ట్రంలో మహిళాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సీఎం పెద్దపీట వేశారు. గత టీడీపీ ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని విస్మరించింది. మహిళలు తమ హక్కుల కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేది. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి మహిళలకు పెద్ద పీట వేస్తూ వస్తున్నారు.

జగనన్నకు అండగా మహిళామణులు..

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేలా తోడ్పాటునిస్తూ పథకాలను అమలుచేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కార్యక్రమంలో మహిళలకు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ ఆసరా, చేయూత, అమ్మఒడి వంటి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మద్యం రాకాక్షి మహిళల జీవితాలను నాశనం చేస్తుందనే కారణంతో మద్యం రేట్లు పెంచడంతో పాటు షాపులు తగ్గించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలంతా జగనన్నకు అండగా నిలుస్తున్నారు.

మహిళా సాధికారితకు జగనన్న పెద్దపీట..

అలాంటి మహిళలను టీడీపీ నేతలు ఆటబొమ్మలా చూస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అలాంటి రాబందుల నుంచి మహిళలను కాపాడటానికి జగనన్న తోడుగా ఉంటున్నారు. మహారాణులైన మహిళలు.. తల్లిలా లాలించడమే కాదు... రాణిలా పాలించగలరన్న విశ్వాసంతో మహిళలు ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా బలంగా ఎదిగేందుకు సర్వదా కృషి చేస్తున్నారు సీఎం జగన్. అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. ఆ దుర్గమ్మ తల్లి దీవెనలతో మహిళలు అన్ని రంగాల్లో శక్తివంతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. విజయదుర్గా ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు.