వదిన, మరిది కలిసి....
- IndiaGlitz, [Thursday,March 07 2019]
వదిన జ్యోతిక, మరిది కార్తి కలిసి సినిమా చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే ఇదొక క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి. సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక ఇప్పుడు మళ్లీ సినిమాల్లో మహిళా ప్రధానమైన చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె సూర్య తమ్ముడు, హీరో అయిన తన మరిది కార్తితో కలిసి సినిమా చేయనుంది.
ఇదొక క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి. దృశ్యం వంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ని తెరకెక్కించిన దర్శకుడు జీతు జోసెఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. కార్తి హీరోగా నటించే ఈ చిత్రంలో జ్యోతిక ఓ కీలక పాత్రధారిగా నటిస్తారట. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుందని కోలీవుడ్ వర్గాల టాక్.