ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యతో పాటు..
Send us your feedback to audioarticles@vaarta.com
జీవితకథ ఆధారిత (బయోపిక్) సినిమాలంటే.. ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన విషయాలు చెబుతారు చూడొచ్చు అనుకుంటారు ప్రేక్షకులు. కాని కొన్ని బయోపిక్‌లకు మాత్రం ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడమే కాదు.. ఆ పాత్రలో ఇమిడిపోయే ఆ పాత్రధారుణ్ని కూడా చూడాలనుకుంటారు. ఇప్పుడు సరిగ్గా ఇటువంటి పరిస్థితులతో తర్జనభర్జనలు పడుతున్నారు బాలకృష్ణ అండ్ టీం. మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా యన్.టి.ఆర్` సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దీనికి ఆయన తనయుడు బాలకృష్ణ ఓ నిర్మాత కాగా.. తేజ దర్శకుడు. ఇప్పటికీ పాత్రధారుల ఎంపిక జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చింది.
అదేమిటంటే.. ఎన్టీఆర్ యుక్తవయసులో ఉన్న సన్నివేశాలను చిత్రీకరించేందుకు వేరొక ఆర్టిస్ట్‌ను అన్వేషిస్తున్నారట బాలయ్య. ఎన్టీఆర్ నడివయస్కుడి పాత్రలో బాలయ్య కనిపించనున్న విషయం తెలిసిందే. మరి యుక్తవయస్కుడిగా బాలకృష్ణ సరిపోరు. ఆ వయసులో ఎన్టీఆర్ అందం గురించి అందరికి తెలిసిందే. చాలా సన్నగా ఉండేవారు. మరి ఇప్పటికిప్పుడు బాలకృష్ణ సన్నబడటం జరిగేపని కాదు. అందుకే ఆ పాత్ర కోసం వేరే నటుణ్ని వెతికే పనిలో పడింది యన్.టి.ఆర్` అండ్ టీం. సరిగ్గా.. అటువంటి నటుడి కోసం మహానటి` సినిమా టీమ్ కూడా ఎప్పటినుంచో వెతుకుతోంది. ఒకవేళ అటువంటి నటుడు దొరికితే.. రెండు సినిమాల్లో కూడా అతని చేతే ఎన్టీఆర్ పాత్రను చేయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ లాంటి మహానటుడు మాత్రమే కాదు.. అంత అందగాడు కూడా దొరుకుతాడా? చూద్దాం.. దొరికితే ఈ చిత్రాల బృందాలతో పాటు ప్రేక్షకులకి కూడా కనువిందేగా మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments